- Telugu News Photo Gallery Viral photos Tomato laden lorry turns turtle in telangana while heading to delhi from kolar police protection
Tomato Price Hike: బోల్తా పడిన టమాటాలతో వెళ్తున్న లారీ.. రక్షణగా నిలిచిన పోలీసులు.. నెట్టింట్లో వైరల్
కూరగాయల ధరలు ఎప్పుడూ అతి వృష్టి.. లేదంటే అనావృష్టి అన్న చందంగా ఉంటాయి. ముఖ్యంగా టమాటా, ఉల్లి పాయ ధరలు ఆకాశాన్ని తాకుతాయి.. లేదంటే ధర లేక రోడ్లమీద పడబోసే విధంగా ఉంటాయి. గత నెల రోజులుగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సరైన ధరలు లేక అల్లాడిన రైతన్నకు టమాటా ధరలు ఒక వరంగా మారాయని చెప్పవచ్చు.
Updated on: Jul 18, 2023 | 4:30 PM

కొన్ని రోజుల క్రితం వరకూ.. సరైన ధరలేక ప్రతిసారీ టమాటాలను ట్రాక్టర్లలో లోడ్ చేసి రోడ్డున పడేసిన రైతులకు ఈసారి టమాటా లాభాలను పండిస్తోంది. బంగారం ధరతో సరి సమానంగా టమాటా ధర పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో టమాటా పంట పండిస్తున్న రైతన్నకు సిరుల పంట పండిస్తోంది టమాటా.

కొందరు అయితే టమాటాలకు రక్షణ కల్పిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక లోని కోలార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి టమాటాలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

కిందపడిన టమాటా లారీకి పోలీసులు రక్షణ కల్పించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టమాటా లారీ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కోలార్ ఏపీఎంసీ మార్కెట్ నుంచి టమాటా లోడు ఉన్న లారీ ఢిల్లీకి వెళ్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది.

లారీ బోల్తా పడడంతో రోడ్డుపై టమోటాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వెంటనే పోలీసులు టమాటా లారీకి రక్షణ కల్పించిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

దొంగల నుంచి రక్షణ కల్పించేందుకు తెలంగాణ పోలీసులు ముగ్గురు పోలీసులను మోహరించారు. మరోవైపు టమాటా రైతులు తమ టమాటా పంటను కాపాడుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.




