Viral Photos: ప్రపంచంలోని 5 డేంజరస్ రైల్వే ట్రాక్‌లు.. ఫొటోలు చూస్తే వామ్మో..?
Viral Photos: ప్రపంచంలో సాహసం చేయడానికి ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. వారు ఎంతటి ప్రమాదకరమైన ప్రదేశానికైనా వెళుతారు. ఈ రోజు ప్రపంచంలో అతి ప్రమాదకరమైన రైల్వే ట్రాక్‌ల గురించి తెలుసుకుందాం.
Updated on: Nov 19, 2021 | 6:03 AM

సాల్టా పోల్వెరిల్లో ట్రాక్, అర్జెంటీనా: ఈ ట్రాక్‌ని తయారు చేయడానికి దాదాపు 27 ఏళ్లు పట్టింది. ఈ ట్రాక్ సామాన్య ప్రజల కోసం1948 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ట్రాక్ 4,200 ఎత్తులో ఉంటుంది. ఏదైనా రైలు దాని మీదుగా వెళ్ళినప్పుడు అది 29 వంతెనలు, 21 సొరంగాల గుండా వెళుతుంది.

అసో మయామి రూట్, జపాన్: రెండో రైల్వే ట్రాక్ అసో మయామి మార్గం. ఇది జపాన్‌లోని అత్యంత ఛాలెంజింగ్ రైల్ ట్రాక్. 2016 సంవత్సరంలో కుమామోటోలో భూకంపం వచ్చినప్పుడు కొంత భాగం దెబ్బతింది. అప్పటి నుంచి ఇది చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు.

చెన్నై నుంచి రామేశ్వరం మార్గం: ఇది అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన రైల్వే ట్రాక్‌లో ఒకటి. దీని ట్రాక్‌ను పవన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మహాసముద్రంపై నిర్మంచారు. ఇది 2.3 కి.మీ. ఉంటుంది. ఇది 1914 సంవత్సరంలో నిర్మించారు.

కేప్ టౌన్ దక్షిణాఫ్రికా: ఈ ట్రాక్ దొంగతనం, దాడి సంఘటనల నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇక్కడి నుంచి ఏదైనా రైలు వెళ్లినప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి రావడంతో తరచూ రైళ్లను రద్దు చేయాల్సి ఉంటుంది.

డెవిల్స్ నోస్, ఈక్వెడార్: ఈ రైల్వే ట్రాక్ సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ ట్రాక్ పని 1872 సంవత్సరంలో ప్రారంభించి 1905 లో పూర్తి చేశారు. ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నప్పుడు చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దీనిని డెవిల్స్ నోస్ ట్రాక్ అని పిలుస్తారు.





























