- Telugu News Photo Gallery Viral photos A boy from Russia said that he came to save the earth from nuclear war Telugu news
భూమిని కాపాడేందుకు వచ్చాను.. ఆశ్చర్యపరుస్తున్న బాలుడి వాదన..
రష్యాకు చెందిన ఓ బాలుడు గత జన్మలో అంగారక గ్రహ నివాసిగా ఉన్నానని, అణుయుద్ధం కారణంగా భూమిని నాశనం చేయకుండా కాపాడటానికి భూమిపై జన్మించానన్నాడు. ఆతడు చేసిన ఈ వింత ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది....
Updated on: Nov 15, 2022 | 12:49 PM

రష్యాకు చెందిన బోరిస్ చాలా చిన్న వయస్సులోనే తన ప్రత్యేకమైన కామెంట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జనవరి 11, 1996న జన్మించిన బోరిస్ కేవలం 4 నెలల వయస్సులో ఉన్నప్పుడు మాట్లాడటం ప్రారంభించాడని అతని తల్లి పేర్కొంది. అంతరిక్షంలోని ఇతర గ్రహాలపై జీవం అన్వేషణలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఇంకా రానప్పటికీ రాబోయే కాలంలో మార్స్ పై మానవ నివాసం ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ది సన్ నివేదిక ప్రకారం బోరిస్ తల్లి కూడా కేవలం ఒక సంవత్సరం వయస్సులో చదవడం, రాయడం ప్రారంభించాడని చెప్పింది. చిన్న వయసులో ఏలియన్స్ గురించి, అంతరిక్షం గురించి మాట్లాడేవాడని, అతను కొంచెం పెద్దయ్యాక ఆ విషయాలు చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది.

బోరిస్ గత జన్మలో తాను గ్రహాంతర వాసినని, అంగారకుడిపై జీవించానని పేర్కొన్నాడు. అతని వాదన ప్రకారం, అణుయుద్ధం కారణంగా అంగారక గ్రహంపై ఉన్న ప్రతిదీ నాశనం చేశారని, దీని కారణంగా గ్రహాంతరవాసులు ఉపరితలం కింద నివసించడం ప్రారంభించారని చెబుతున్నాడు.

అణుయుద్ధం నుంచి భూమిని కాపాడేందుకు తాను అంగారక గ్రహం నుంచి భూమిపైకి వచ్చానని బోరిస్ చెప్పాడు. అయితే ప్రస్తుతానికి బోరిస్, అతని తల్లి ఇద్దరూ కనిపించకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో అతను చెప్పిన స్టోరీ మరింత ఇంట్రెస్ట్ గా మారింది.

ఇదిలా ఉంటే ఓ బాలుడు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాను అంగారక గ్రహ నివాసి అని, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం భూమిపైకి వచ్చానని చెబుతుండటం గమనార్హం.



