AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేభారత్ ఏసీ స్లీపర్ వచ్చేస్తోంది.. ఇకపై తక్కువ ధరకే విమానం లాంటి ప్రయాణం.!

వందేభారత్ రైళ్ల తయారీలో ప్రస్తుతం స్టీల్ లోహాన్ని వాడుతుండగా.. హై-స్పీడ్ వేగాన్ని అందుకోవాలంటే.. అల్యూమినియం లోహాంతో రూపొందించాలి. ఇదంతా అయ్యేందుకు కనీసం రెండేళ్లు పట్టొచ్చునని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ సమూల మార్పులు తీసుకురానున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి 75 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 25 మాత్రమే నడుస్తున్నాయి. ఈ వందేభారత్ రైలు తయారీ..

Ravi Kiran
|

Updated on: Jul 31, 2023 | 12:55 PM

Share
 వందేభారత్ రైళ్లలలో మరిన్ని మార్పులు తీసుకురానుంది  ఇండియన్ రైల్వేస్. వీటిని కూడా 'హై-స్పీడ్' రైళ్ల కేటగిరీలో చేర్చేలా వేగాన్ని పెంచేందుకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రణాళికలు రచిస్తోంది.

1 / 6
ప్రస్తుతం ట్రాక్ సామర్ధ్యం బట్టి ఈ వందేభారత్ రైళ్లు గంటకు 60 నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా.. రానున్న రోజుల్లో ఆ వేగాన్ని 200 నుంచి 220 కిమీ మేరకు పెంచాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.

2 / 6
వందేభారత్ రైళ్ల తయారీలో ప్రస్తుతం స్టీల్ లోహాన్ని వాడుతుండగా.. హై-స్పీడ్ వేగాన్ని అందుకోవాలంటే.. అల్యూమినియం లోహాంతో రూపొందించాలి. ఇదంతా అయ్యేందుకు కనీసం రెండేళ్లు పట్టొచ్చునని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ సమూల మార్పులు తీసుకురానున్నారు.

3 / 6
 వాస్తవానికి ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి 75 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 25 మాత్రమే నడుస్తున్నాయి. ఈ వందేభారత్ రైలు తయారీ కేవలం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోని తయారీ అవుతున్నాయి. అందుకే వచ్చే ఏడాది మార్చి నాటికీ 77 రైళ్లు తయారు అయ్యేలా ఐసీఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది.

4 / 6
 ఇక వందేభారత్ ఏసీ స్లీపర్ మరికొన్ని నెలల్లో పట్టాలెక్కనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ కొత్త వెర్షన్‌ను తయారు చేసే దిశగా రైల్వే అధికారులు అడుగులేస్తున్నారు. ఏసీ స్లీపర్‌లో 1 టైర్ ఏసీ ఒక కోచ్, టూ టైర్ ఏసీ 4 కోచ్‌లు, త్రీ టైర్ ఏసీ 11 కోచ్‌లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

5 / 6
కాగా, రానున్న రోజుల్లో వందేభారత్ రైళ్లు మూడు రంగుల్లో పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం తెలుపు, నీలం కలిపిన రంగు అందరినీ ఆకట్టుకుంటుండగా.. మరో రెండు రంగుల్లో ఒకటి కాషాయం, బూడిద.. మరొకటి బూడిద, కాషాయం కనిపించేలా తయారు చేస్తున్నారు.

6 / 6