Viral news: ఢీకొట్టిన రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం..

Updated on: Mar 27, 2024 | 7:56 PM

కోల్‌కతాలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొట్టిన సంఘటన బుధవారం కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ రెండు విమాణాలు ఎలా ఢీకొట్టాయి.? అసలు ప్రమాదం ఎలా తప్పిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

1 / 5
 కోల్‌కతా విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానాలు ఒకదానికి ఒకటి ఢీకొట్టాయి.

2 / 5
బుధవారం మధ్యాహ్నం ఇండిగో విమానం బిహార్‌లోని దర్భంగా వెళ్లడానికి క్లియరెన్స్‌ కోసం వేచి ఉంది. అయితే అదే సమయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టింది.

3 / 5
ఈ సమయంలో ఇండిగో విమానంలో ఏకంగా 135 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది.

4 / 5
ఇదిలా ఉంటే ఈ ఘటనపై డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివల్ ఏవియేషన్ సీరియస్ అయింది. రెండు ఫ్లైట్స్ పైలట్లును విధుల నుంచి తొలగించి.. వివరణ ఇవ్వాలని కోరారు.

5 / 5
ఈ సంఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు అధికారులు. ప్రమాద సమయంలో ఇండిగో విమానం ఎడమవైపు ఉన్న రెక్క  విరిగిపోయింది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కుడివైపు ఉన్న రెక్క ఒంగిపోయింది. ఈ సంఘటన నేపథ్యంలో కోల్‌కతా, దర్భంగా మధ్య ఇండిగో ఫ్లైట్ 6E 6152 ఆలస్యం అయింది.