AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel in India: మీరు చిరంజీవిలా బంగీ జంపింగ్‌ చేయాలనుకుంటున్నారా.. మన దేశంలో బెస్ట్ ప్లేసెస్ ఇవే..

రోటీన్ లైఫ్ బోర్ కొడుతోంది.. డిఫరెంట్ గా జీవితంలో కొంత సమయం అయినా గడపాలని కోరుకుంటున్నారా... ఉత్తేజకరమైన సంఘటనలను అనుభవించాలనుకుంటే.. భారతదేశంలో మీకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దైర్యసాహస కార్యక్రమాలను ఇష్టపడేవారు బంగీ జంపింగ్ చేయాలనీ భావిస్తారు. అటువంటి వారు మన దేశంలో ఈ ప్రదేశాలను తప్పక సందర్శించాలి. ఇవి మీ ప్రయాణ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి.

Surya Kala
|

Updated on: May 19, 2025 | 6:00 PM

Share
అందరికీ కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి.. ప్రయాణం చేయడం అంటే ఇష్టమే. మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళడం వలన మీలోని ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రజలు వేసవి సెలవుల్లో కొత్త ప్రదేశాలకు ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటారు. కనుక మీరు కూడా ఈ సెలవులను చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకుంటే.. భారతదేశంలో సాహసాలు చేసేందుకు అనువైన కొన్ని ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్కడ మీ మనసును రిఫ్రెష్ చేయడమే కాకుండా..వాటిని గుర్తుచేసుకున్నప్పుడు మీ ముఖంలో చిరునవ్వు తెచ్చే అందమైన అనుభవాన్ని కూడా పొందుతారు.

1 / 7
భారతదేశంలో అనేక రకాల సాహస కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన ప్రదేశాలున్నాయి. పారాగ్లైడింగ్, రాఫ్టింగ్, బంగీ జంపింగ్, స్కూబా డైవింగ్ వంటి సరదా కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఈరోజు మనం భారతదేశంలో బంగీ జంపింగ్ కోసం ఏ ప్రదేశాలను అన్వేషించవచ్చో తెలుసుకుందాం. భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలు బంగీ జంపింగ్ కు ఉత్తమమైనవి. భారతదేశంలోనే ఎత్తైన బంగీ జంపింగ్ రిషికేశ్‌లో ఉంది.

2 / 7
రిషికేశ్ ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందడమే కాదు మీరు ఇక్కడ అనేక రకాల సాహస కార్యకలాపాలను కూడా చేయవచ్చు. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మీరు ఇక్కడ బంగీ జంపింగ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. భారతదేశంలోనే ఎత్తైన బంగీ జంపింగ్ ఇక్కడ జరుగుతుంది. దీని ఎత్తు 83 మీటర్లు. రిషికేశ్‌లో, శివపురి , మోహన్ చట్టి వంటి ప్రదేశాలలో బంగీ జంపింగ్ చేస్తారు.

3 / 7
లోనావాలా.. ముంబైలో నివసిస్తున్నా లేదా అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే లోనావాలా పేరు ఖచ్చితంగా మీ పర్యటన జాబితాలో ఉండాలి. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంటుందో అంతే వినోద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా మీరు ప్రశాంతతను అనుభవిస్తారు. మీరు ఇక్కడ బంగీ జంపింగ్ కూడా చేయవచ్చు. ఇక్కడ బంగీ జంపింగ్ ఎత్తు 28 మీటర్లు. ఇక్కడ మీరు ఈ క్రీడను సురక్షితంగా ఆడేలా చేస్తారు. అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ మీరు ఇక్కడ బంగీ జంపింగ్ చేయవచ్చు.

4 / 7
గోవాలో బంగీ జంపింగ్: గోవా బీచ్‌లు, పార్టీలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ప్రదేశంలో మీరు బంగీ జంపింగ్ కూడా ఆనందించవచ్చని మీకు తెలుసా. ఇక్కడ గ్రావిటీ జోన్‌లో, అంజునా బీచ్‌లో 35 మీటర్ల ఎత్తులో బంగీ జంపింగ్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ప్రజలు బంగీ జంపింగ్ చేయడానికి ఇక్కడికి వస్తారు. ఈ బీచ్ బంగీ జంపింగ్ కు ప్రసిద్ధి చెందింది.

5 / 7

బెంగళూరులో సరదా బంగీ జంపింగ్:  బెంగళూరు ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే ఆఫీసు సంస్కృతికి అతీతంగా, ఈ ప్రదేశం సాహస కార్యక్రమాలతో నిండి ఉంది. బంగీ జంపింగ్ కోసం పర్యాటకులు ఎల్లప్పుడూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ బంగీ జంపింగ్ 25 మీటర్ల ఎత్తులో జరుగుతుంది. ఇక్కడ బంగీ జంపింగ్ చేసే సరదా వేరు.

6 / 7
గురుగ్రామ్: గురుగ్రామ్‌లో కూడా బంగీ జంపింగ్ చేయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గురుగ్రామ్‌లోని బ్యాక్‌యార్డ్ స్పోర్ట్స్ క్లబ్‌లో మీరు బంగీ జంపింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇక్కడ బంగీ జంపింగ్ 60 మీటర్ల ఎత్తులో జరుగుతుంది.

7 / 7