
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. రెండు, మూడు సంవత్సరాల పిల్లలు కూడా చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు అలవాటు అయిపోతున్నారు. చాలా మంది పిల్లల నుంచి వృద్ధుల వరకు సోషల్ మీడియలో ఎక్కువ సేపు గడపడం, కొందరు ల్యాప్ టాప్‌లో ఎక్కువ సేపు పని చేయడం, షోలు చూడటం వంటివాటి వలన ఎక్కువ సేపు స్క్రీన్ ముందు ఉంటున్నారు. అయితే ఇది గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

నిరంతరం స్క్రీన్ వాడటం వలన ఒత్తి, ఆందోళన వలన ఇది మానసిక స్థితిపై ప్రభావం చూపి, గుండె సమస్యలకు కారణం అవుతుందంట. గంటల తరబడి స్క్రీన్ ముందు ఉండటం వలన ఇది కళ్లపై ఒత్తిడిని పెంచి, తలనొప్పికి కారణం అవుతుందంట. అంతే కాకుండా స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు, మెడ నొప్పి, భుజాల నొప్పి, వెన్ను నొప్పి , బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

అలాగే ఇది ఒత్తిని ఎక్కువగా పెంచుతుందంట. దీని వలన అలసిపోటినట్లు అనిపించడం, ఒంటరితనం, నిరాశ వంటి నిద్రలేమి వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించుకొని, ఫ్యామిలీ, స్నేహితులతో ఎక్కువసేపు గడపాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా సులభంగా స్క్రీన్‌కు దూరంగా ఉండవచ్చునంట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

మీరు ఒక రోజులో ఎంత సేపు స్క్రీన్ ముందు ఉండాలో ఒక ప్రణాళిక గీసుకోండి. అదే విధంగా మీ డిన్నర్ టేబుల్, బెడ్ రూమ్ నుంచి ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని దూరం ఉంచండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భోజనం చేయండి. ఇది మీ మనసుకు మంచి ప్రశాంతతను అందిస్తుంది.

అలాగే మీరు స్ర్రీన్ ముందు ఎంత సమయం గడుపుతున్నారో కూడా తెలుసుకోవాలి. దీని వలన మీరు మీ కళ్లు, శరీరం, మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునంట. ముఖ్యంగా అతిగా స్క్రీన్ వాడటం వలన గుండె జబ్బుల ప్రమాదం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.