- Telugu News Photo Gallery This is Baba Vanga astrology prediction about the sensational events and AI that will happen in 2026
2026లో జరిగేది ఇదే.. AI గురించి సంచలనాలు బయటపెట్టిన బాబావంగా జ్యోతిష్యం!
బాబా వంగా జ్యోతిష్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే? ఆయన ముందు జరగబోయే ఎన్నో సంఘటనల గురించి తెలియజేసి వార్తల్లో నిలిచారు. బల్గేరియాలో జన్మించిన బాల్కన్స్ నోస్ట్రాడమస్ అని పిలవబడే బాబా వంగా, అంధ ఆధ్యాత్మికవేత్త. ఈమె చిన్నతనంలోనే తన కంటి చూపు కోల్పోయింది. అయితే ఈమె 1996లో మరణించినప్పటికీ , ఈమె ప్రవచనాలకు మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంది.
Updated on: Sep 22, 2025 | 11:33 AM

బాబా వంగా జ్యోతిష్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే? ఆయన ముందు జరగబోయే ఎన్నో సంఘటనల గురించి తెలియజేసి వార్తల్లో నిలిచారు. బల్గేరియాలో జన్మించిన బాల్కన్స్ నోస్ట్రాడమస్ అని పిలవబడే బాబా వంగా, అంధ ఆధ్యాత్మికవేత్త. ఈమె చిన్నతనంలోనే తన కంటి చూపు కోల్పోయింది. అయితే ఈమె 1996లో మరణించినప్పటికీ , ఈమె ప్రవచనాలకు మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంది. బాబా వంగా భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది. అందులో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, 9/11 దాడులు వంటి అనేక సంఘటనలు నిజయం అయ్యాయి. దీంతో ఈమె ప్రవచనాలపై ప్రజలకు ఎక్కువ ఆసక్తికలగడం మొదలైంది.

అయితే 2026 సంవత్సరానికి సంబంధించిన కూడా బాబా వంగా కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. ఆమె అంచనా వేసిన వాటిలో ప్రకృతి వైపరిత్యాలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటాలు, వాతావరణ మార్పలు, భూగర్భంలో ఎనిమిది శాతం ప్రభావితం అవుతుందని ఆమె పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా బాబా వంగా 2026లో జరిగే ఇంకొన్ని సంఘటనల గురించి కూడా తెలియజేసింది.

అందులో మూడో ప్రపంచ యుద్ధం ఒకటి. 2026లో మూడో ప్రపంచ యుద్ధం మొదలు అవుతుందని ఆమె అంచనా వేసినట్లు సమాచారం. అయితే ప్రపంచ లో జరుగుతున్న కొన్ని ఉద్రిక్తతలు, తైవాన్ చైనా స్వాధీనం చేసుకొని ఉన్నతశిఖరాలకు చేరడం, రష్యా, అమెరికా మధ్య ప్రత్యక ఘర్షణ వంటివి రాబోయే సంవత్సరానికి ఆమె అంచనాలలో కొన్ని సంఘటనలు అని తెలుస్తోంది.

ప్రస్తుతం AI అనేది పరుగులు పెడుతుంది.అయితే 2026 నాటికి అది మరింత విస్తరించడమే కాకుండా, ఏఐ గణనీయమైన పురోగతి సాధించి, మానవ వాళిపై దాని అధిపత్యం చేలాయిస్తుందని బాబా వంగా అభిప్రయాం వ్యక్తం చేశారు. అంతే కాకుండా దీని వలన అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

అదే విధంగా బాబా వంగా భూమిపైకి వచ్చే గ్రహాంతర వాసుల గురించి కూడా కొన్ని విషయాలను అంచనా వేసి తెలియజేయడం జరిగింది. గ్రహాంతవాసులతో మొదటి పరిచయం 2026 నవంబర్ లో జరుగుతుందని ఆమె తన జ్యోతిష్యంలో తెలియజేసింది. అలాగే భూమి వాతవరణంలోకి పెద్ద అంతరిక్ష నౌక ప్రవేశించడం గురించి కూడా ఆమె తెలియజేశారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



