Dental hygiene: రోజువారీ జీవితంలో చేసే ఈ చిన్న పొరబాటు.. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందట!

రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు ద్వారాలుగా మారుతాయి. ముఖ్యంగా ఉదయాన్నే లేచి చేసే బ్రష్‌ కూడా ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతుంది. చాలా మంది హడావిడిగా బ్రష్‌ చేసి మమ అనిపించేస్తుంటారు. నిజానికి, దంతాల ఆరోగ్యం నేరుగా మొత్తం ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది..

Srilakshmi C

|

Updated on: Feb 03, 2025 | 5:24 PM

దంతాల ఆరోగ్యం నేరుగా మొత్తం ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వైద్యులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని చెబుతుంటారు. అలాగే రెగ్యులర్‌గా దంత పరీక్షలు కూడా చేయించుకోవడం తప్పనిసరి.

1 / 5
మంచి ఆరోగ్యానికి దంత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వైద్యుల ప్రకారం.. దంతాల పరిశుభ్రత స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. వారానికి ఒక్కసారైనా దంత పరీక్షలు చేయడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండె చప్పుడు సక్రమంగా కొట్టుకోవడం వల్ల వచ్చే స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2025.. ప్రజలు ఎంత తరచుగా దంతాలను ఫ్లాస్ చేస్తారో, బ్రషింగ్‌తో సహా ఇతర దంత పరిశుభ్రత పద్ధతులను అనుసరించే పలు విధానాలను పరిశీలించారు. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం రచయిత సౌవిక్ సేన్ మాట్లాడుతూ.. 'చికిత్స చేయని దంత క్షయం', 'చిగుళ్ల వ్యాధులు' వంటి నోటి వ్యాధులు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

3 / 5
ఇది 2022లో 3.5 బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. డెంటల్ ఫ్లాసింగ్, టూత్ బ్రషింగ్, డెంటల్ చెకప్‌లు స్ట్రోక్‌లను నివారించవచ్చని పరిశోధకులు తెలిపారు. నిపుణులు ఫ్లోసింగ్‌పై ప్రయోగాత్మకంగా అధ్యయనం చేశారు. వీరి పరిశోధనలో.. ప్రజలు తమ ఇళ్లల్లో డెంటల్ ఫ్లాస్‌ను ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించగా.. 6 వేల మంది ఫ్లాస్ తరచూ చేస్తున్నట్లు కనుగొన్నారు.

4 / 5
ఫలితంగా వీరిలో 4,092 మందికి పక్షవాతం రాలేదని, 4,050 మందికి గుండె సంబంధిత సమస్యలు లేవని గుర్తించారు. గతంలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, నోటి అపరిశుభ్రత వల్ల గుండె కొట్టుకోవడంలో లోపాలు, స్ట్రోకులు, గుండెపోటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. నోటి సమస్యలను నివారించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వీరి అధ్యయనంలో తేలింది.

5 / 5
Follow us