AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రిపూట నిద్రపట్టడం లేదా..? పడుకునే ముందు ఈ పదార్థాలు తినండి..

రాత్రి నిద్రించే ముందు మనం తీసుకునే ఆహారాలు మన జీర్ణ క్రియ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరం సరిగ్గా పనిచేయాలంటే తన శక్తిని నిలుపుకోవడానికి రాత్రి నిద్ర చాలా అవసరం.

Madhavi
| Edited By: |

Updated on: Apr 12, 2023 | 8:45 AM

Share
రాత్రి నిద్రించే ముందు మనం తీసుకునే ఆహారాలు మన జీర్ణ క్రియ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరం సరిగ్గా పనిచేయాలంటే తన శక్తిని నిలుపుకోవడానికి  రాత్రి నిద్ర చాలా అవసరం. మీరు ప్రతిరోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ చాలామంది తగినంత నిద్ర పొందడానికి  కష్టపడుతుంటారు.

రాత్రి నిద్రించే ముందు మనం తీసుకునే ఆహారాలు మన జీర్ణ క్రియ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరం సరిగ్గా పనిచేయాలంటే తన శక్తిని నిలుపుకోవడానికి రాత్రి నిద్ర చాలా అవసరం. మీరు ప్రతిరోజు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ చాలామంది తగినంత నిద్ర పొందడానికి కష్టపడుతుంటారు.

1 / 6
ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారం మరెన్నో ఇతర కారణాలు కావచ్చు. ఇవన్నీ కూడా నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రపోయే  ముందు ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల నాణ్యమైన నిద్రతోపాటు మంచి జీర్ణక్రియ ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మనం రాత్రి నిద్రించే ముందు తీసుకోవల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం.

ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారం మరెన్నో ఇతర కారణాలు కావచ్చు. ఇవన్నీ కూడా నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రపోయే ముందు ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల నాణ్యమైన నిద్రతోపాటు మంచి జీర్ణక్రియ ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. మనం రాత్రి నిద్రించే ముందు తీసుకోవల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం.

2 / 6
బాదం:
బాదం అనేది ఒక రకమైన డ్రై ఫ్రూట్.  ఇది ఆరోగ్యకరమైన శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. హెల్త్ లైన్ ప్రకారం బాదంలో ఉండే మెలటోనిన్, నిద్రను మెరుగుపరిచే మినరల్ మెగ్నిషియం యొక్క గొప్ప మూలకాలు ఇందులో ఉన్నాయి. ఈ రెండు కూడా రాత్రి మంచి నిద్రకు దోహదం చేస్తాయి.

బాదం: బాదం అనేది ఒక రకమైన డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. హెల్త్ లైన్ ప్రకారం బాదంలో ఉండే మెలటోనిన్, నిద్రను మెరుగుపరిచే మినరల్ మెగ్నిషియం యొక్క గొప్ప మూలకాలు ఇందులో ఉన్నాయి. ఈ రెండు కూడా రాత్రి మంచి నిద్రకు దోహదం చేస్తాయి.

3 / 6
చమోమిలే టీ
చమోమిలే టీ అనేది ఒక హెర్బల్ టీ. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ టీలతో ఫ్లెవోనోలు కూడా సమ్రుద్ధిగా ఉంటాయి. ఈ టీని తరచుగా తాగినట్లయితే క్యాన్సర్ , గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే వాపును తగ్గిస్తుంది. చమోమిలే టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా చమోమిలే టీలో ఎన్నో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

చమోమిలే టీ చమోమిలే టీ అనేది ఒక హెర్బల్ టీ. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ టీలతో ఫ్లెవోనోలు కూడా సమ్రుద్ధిగా ఉంటాయి. ఈ టీని తరచుగా తాగినట్లయితే క్యాన్సర్ , గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే వాపును తగ్గిస్తుంది. చమోమిలే టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా చమోమిలే టీలో ఎన్నో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

4 / 6
కివి
కివి విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె కూడా ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో కీలకంగా పనిచేస్తాయి. కివీస్ లో సెరోటోనిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కివిని పడుకునే ముందు తింటే నిద్ర నాణ్యత పెరుగుతుంది.

కివి కివి విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె కూడా ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో కీలకంగా పనిచేస్తాయి. కివీస్ లో సెరోటోనిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కివిని పడుకునే ముందు తింటే నిద్ర నాణ్యత పెరుగుతుంది.

5 / 6
వాల్నట్ 
నిత్యం కొన్ని వాల్నట్స్ తిన్నట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి బలోపేతం చేసేందుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. మెదడు ఆరోగ్యం, పనితీరును మెరుగుపరిచే మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్ , సెలీనియం వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

వాల్నట్ నిత్యం కొన్ని వాల్నట్స్ తిన్నట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధకశక్తి బలోపేతం చేసేందుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. మెదడు ఆరోగ్యం, పనితీరును మెరుగుపరిచే మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్ , సెలీనియం వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

6 / 6