చక్రాసనం: నిటురుగా పడుకుని, పాదాలను నెలపై మోపి, మోకాళ్ల వద్ద వంచి, చేతులను భుజాల దగ్గరికి తీసుకుని అరచేతులను నేలపై ఆనించాలి. వెనుకనుంచి చేతులను పాదాల దిశగా కదిలించి, తల నేలపై ఉంచి శరీరాన్ని పైకి ఎత్తాలి. తర్వాత తలను పైకి లేపాలి. కాళ్లు, చేతులు, నడుము సాగినట్లు అనిపించేలా తలను పూర్తిగా పైకి లేపాలి. శరీరం చక్రం భంగిమలో ఉంచాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్లపాటు ఉండి, ఆపై విడుదల రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా ఆసనాన్ని రెండుసార్లు రిపీట్ చేయ్యాలి.