AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులతో తినడం వెనక ఇంత పెద్ద కథ ఉందా.. భారతీయ సంస్కృతి అంటే మామూలుగా ఉండదు మరి..

ఆధునిక కాలంలో స్పూన్లు, ఫోర్కులు ఉపయోగించి తినడమే ఒక నాగరికతగా, క్రమశిక్షణగా చాలామంది భావిస్తుంటారు. ఎవరైనా చేత్తో తింటూ కనిపిస్తే వారికి టేబుల్ మేనర్స్ లేవని, అది పాతకాలపు పద్ధతి అని ఈసడించుకునే వారు కూడా ఉన్నారు. అయితే చేత్తో తినడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు... దాని వెనుక ఎంతో లోతైన మానసిక శాస్త్రం, సంస్కృతి, భావోద్వేగ బంధం దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చేత్తో తినే వారి ప్రవర్తన వెనుక ఉన్న ఆసక్తికరమైన సైకలాజికల్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jun 18, 2026 | 2:49 PM

Share
పంచేంద్రియాల అనుభూతి: మనం ఆహారాన్ని కేవలం నాలుకతోనే రుచి చూడం. మెదడు ఆహారం రంగు, వాసన, ఉష్ణోగ్రత, స్పర్శను కూడా ప్రాసెస్ చేస్తుంది. సైకాలజీ ప్రకారం.. చేత్తో తినేటప్పుడు ఆహారం నోట్లోకి వెళ్లడానికంటే ముందే చేతి వేళ్లకు తగలడం వల్ల మెదడుకు అదనపు సమాచారం అందుతుంది. దీనిని మల్టీసెన్సరీ ఇంటిగ్రేషన్ అంటారు. దీనివల్ల ఆహారంపై మరింత శ్రద్ధ పెరిగి, తినే ప్రతి ముద్ద ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.

1 / 5
మూలాలు, జ్ఞాపకాలతో అనుబంధం: భారత్, ఇథియోపియా, మధ్యప్రాచ్య దేశాలలో చేత్తో తినడం అనేది శతాబ్దాల నాటి సంస్కృతి. సైకాలజీలోని సోషల్ ఐడెంటిటీ థియరీ ప్రకారం.. మనుషులు తమ సంస్కృతి, సంప్రదాయాల ద్వారా ఒక రకమైన గుర్తింపును, మనశాంతిని పొందుతారు. చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చేత్తో తినిపించిన ముద్దలు, పండుగలు, కుటుంబ వేడుకల జ్ఞాపకాలు చేత్తో తినే అలవాటుతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పరాయి దేశాలలో స్థిరపడిన వారు తమ మూలాలను, పూర్వీకుల సంస్కృతిని గుర్తుచేసుకోవడానికి ఈ పద్ధతిని ఒక వారధిలా భావిస్తారు.

2 / 5
మానసిక ప్రశాంతత: మనుషులకు కొన్ని అలవాట్లను ఒక పద్ధతి ప్రకారం చేయడం అలవాటు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మెదడుకు ఒక రకమైన భద్రతా భావం లభిస్తుంది. చేత్తో తినడం అనేది నరాల వ్యవస్థను శాంతపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఉదయాన్నే కాఫీ తాగడం, ఫోన్లు పక్కన పెట్టి కుటుంబంతో కలిసి కూర్చోవడం ఎలాగైతే మనసుకు ప్రశాంతతను ఇస్తాయో... చేత్తో తినడం కూడా అంతే సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

3 / 5
మైండ్‌ఫుల్ ఈటింగ్: స్పూన్లు, ఫోర్కులతో తినేటప్పుడు చాలామంది మెకానికల్‌గా తినేస్తుంటారు. కానీ చేత్తో తినేటప్పుడు ఆహారం వేడి, దాని ఆకృతి, ముద్ద పరిమాణంపై సహజంగానే మన ధ్యాస ఉంటుంది. దీనినే హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా మైండ్‌ఫుల్ ఈటింగ్ అని పిలుస్తారు. ఆహారాన్ని ఆస్వాదిస్తూ, నెమ్మదిగా తినడం వల్ల జీర్ణక్రియ బాగుండటమే కాకుండా, ఎంత తినాలో అంతకంటే ఎక్కువ తినకుండా నియంత్రించుకోవచ్చు.

4 / 5
కాబట్టి ఇకపై ఎవరైనా చేత్తో తింటూ కనిపిస్తే వారికి మేనర్స్ లేదు అని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని నిపుణులు అంటున్నారు. చేతులతో తింటున్నారంటే వారు ఆహారంతో, తమ సంస్కృతితో, మధురమైన జ్ఞాపకాలతో ఒక లోతైన భావోద్వేగ బంధాన్ని ముడిపెడుతున్నారని అర్థం.

5 / 5
Follow Us
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే

ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే

ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..

పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం

ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..

ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?

ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను

పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో

ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..

ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం