Health Tips: తరుచూ తలనొప్పి వస్తుందా.. అసలు కారణం తెలిస్తే షాకే..
మన బిజీ లైఫ్, పని ఒత్తిడి కారణంగా తలనొప్పి రావడం అనేది సర్వసాధారణమైన సమస్య. కానీ ఈ తలనొప్పి ప్రతిరోజూ వస్తుంటే మాత్రం దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది మీ శరీరంలో ఏదైనా పోషకాహార లోపానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా కొన్ని విటమిన్ల లోపం వల్ల నిరంతర తలనొప్పి వస్తుంది.
Updated on: Sep 20, 2025 | 6:01 PM

విటమిన్ డి: విటమిన్ డి లోపం వల్ల తరచుగా తలనొప్పి వస్తుంది. ఈ విటమిన్ లోపం ఎక్కువ కాలం ఉంటే అది కేవలం ఎముకలు, కండరాల పనితీరునే కాకుండా మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే తలనొప్పి నిరంతరంగా వస్తుంటే విటమిన్ డి లోపం ఉందేమో చూసుకోవాలి.

విటమిన్ డి పొందడానికి: విటమిన్ డికి అత్యంత సహజమైన, ఉత్తమమైన వనరు సూర్యరశ్మి. ఉదయం పూట కొంతసేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. అదనంగా మీ ఆహారంలో గుడ్లు, పాలు, ఆకుకూరలు, గింజలు చేర్చుకోవడం వల్ల కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

ఫోలేట్ లేదా విటమిన్ B9: విటమిన్ B9 లోపం కూడా తలనొప్పికి మరో ప్రధాన కారణం. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే తరచుగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అలసట, బలహీనత, గుండె దడ, ఊపిరి ఆడకపోవడం, చిరాకు వంటివి ఉంటాయి.

ఫోలేట్ పొందడానికి..: ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీ రోజువారీ ఆహారంలో పాలకూర, బ్రోకలీ, పప్పులు, బాదం వంటి వాటిని చేర్చుకోవాలి. ఇవి తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

మీరు ఆహారంలో మార్పులు చేసుకున్నప్పటికీ తలనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ఎందుకంటే తలనొప్పి ఇతర ఆరోగ్య సమస్యల సంకేతం కూడా కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.




