- Telugu News Photo Gallery The Amazing Health Benefits of Chewing Guava Leaves on an Empty Stomach, Check Details
Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..
పండ్లు మన శరీరానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. కానీ కొన్ని పండ్ల ఆకులు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి వాటిలో జామ ఆకులు ఒకటి. జామ పండు ఎంత రుచికరంగా ఉంటుందో దాని ఆకులు కూడా మన ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడతాయి. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 19, 2025 | 9:20 PM

జీర్ణక్రియకు: మారుతున్న జీవనశైలి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి జామ ఆకులు ఒక మంచి పరిష్కారం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమిలితే జీర్ణక్రియ మెరుగుపడి కడుపు సమస్యలు తగ్గుతాయి.

మధుమేహానికి: షుగర్ వ్యాధితో బాధపడేవారికి జామ ఆకులు ఒక వరం లాంటివి. ఈ ఆకులు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జామ ఆకుల కషాయాన్ని ఉదయం పూట తాగడం కూడా మంచిదే.

నోటి పూతలకు: నోటిలో పూతలు చాలా బాధాకరంగా ఉంటాయి. అవి తినడం, తాగడం కూడా కష్టంగా మారుస్తాయి. అలాంటి సమయాల్లో జామ ఆకులు బాగా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది. కావాలంటే రోజుకు 2-3 సార్లు కూడా నమలవచ్చు.

జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం కలిగించి ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

చర్మానికి మంచిది: ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జామ ఆకులు చర్మానికి కూడా మేలు చేస్తాయి. వాటిలో చర్మ సంబంధిత సమస్యలను తగ్గించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అందువల్ల జామ ఆకులను తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.




