- Telugu News Photo Gallery Technology photos Xiaomi Release New Smart TV Mi TV 4C With Advanced Features In Low Price Have A Look On Features And Price
Mi TV 4C: రూ. 16 వేలకే 32 ఇంచెస్ ఎమ్‌ఐ స్మార్ట్ టీవీ.. ఇలా చేస్తే మరో రూ. 1750 డిస్కౌంట్. అద్భుతమైన ఫీచర్లతో..
Mi TV 4C: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో కొత్త కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేస్తున్న షియమీ తాజాగా.. మరో టీవీని లాంచ్ చేసింది. ఎమ్‌ఐ టీవీ 4సీ పేరుతో విడుదల చేసిన ఈ టీవీలో అధునాతన ఫీచర్లను జోడించింది కంపెనీ. ఇక ఈ స్మార్ట్ టీవీ అందుబాటు ధరలో ఉండడం మరో విశేషం....
Updated on: Aug 06, 2021 | 6:10 PM

స్మార్ట్ టీవీ తయారీలో ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ. ఇప్పటికే తక్కువ బడ్జెట్‌లో ఎమ్‌ఐ పేరుతో స్మార్ట్ టీవీలను పరిచయం చేసిన ఈ కంపెనీ తాజాగా మరో స్మార్ట్ టీవీని విడుదల చేసింది.

ఎమ్‌ఐ టీవీ 4సీ పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ అందుబాటు ధరలో ఉండడం విశేషం. ఈ టీవీలో ఎమ్‌ఐ క్విక్ వేవ్ అనే సరికొత్త పీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో టీవీ ఆన్ చేసిన కేవలం 5 సెకన్లలోపే స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది.

32 ఇంచెస్ టీవీఇని కేవలం రూ. 15,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ టీవీని అమేజాన్‌లో కొనుగోలు చేస్తే ఎస్‌బీఐ కార్డుపై రూ. 1750 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సి్‌స్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. యాక్సిస్‌బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా రూ. 750 డిస్కౌంట్‌తో పాటు అదనంగా 5శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్ టీవీ అమ్లాజిక్ కార్టెక్స్ ఏ53 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు.

ఇక సౌండ్‌కు ప్రత్యేక ప్రధాన్యత ఇచ్చిన కంపెనీ డీటీఎస్-హెచ్‌డీ టెక్నాలజీతో కూడిన 20 వాట్స్ స్పీకర్‌లను అందించారు.

అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్,జీ5తో పాటు మరిన్ని ప్రముఖ ఓటీటీ యాప్‌లకు సపోర్ట్ చేసేలా దీన్ని తయారు చేశారు. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనుంది.





























