- Telugu News Photo Gallery Technology photos Video conferencing platform zoom introduced new update now 10 lakh people can connect call at single time
Zoom: ఒకే కాల్‌లో 10 లక్షల మంది.. జూమ్ నుంచి అదిరిపోయే ఫీచర్
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్‌కు మంచి ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో టీమ్ మీటింగ్‌ల కోసం జూమ్‌ను ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో జూమ్‌లో ఆకట్టుకునే ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచరను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా అప్‌డేట్ దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 22, 2024 | 1:05 PM

జూమ్‌లో వెబ్‌నార్ కెపాసిటీని అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఒకేసారి వీడియో కాల్‌లో ఏకంగా 10 లక్ష మంది ఒకేసారి కనెక్ట్ అవ్వొచ్చు. హై ప్రొఫైల్ రాజకీయ నిధుల సేకరణ ఈవెంట్లలో ఎక్కువ మంది పాల్గొంటున్న నేపథ్ంలో జూమ్ ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

జూమ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తోందని జూమ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ స్మితా హషీమ్ తెలిపారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఇటీవలి నిధుల సేకరణ కార్యక్రమాల తర్వాత జూమ్ ఈ అప్‌గ్రేడ్ చేసింది.

ఈ ఫీచర్‌లో ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్‌లు, పబ్లిక్ సెక్టార్ ఔట్రీచ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్‌తో కనెక్ట్ కావడం వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా విస్తృత అవసరాల దృష్ట్యా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చారు.

పెద్ద స్థాయి వర్చువల్ ఈవెంట్‌లు సజావుగా జరిగేలా చూసేందుకు జూమ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ ఉపయోగపడనుంది. అయితే జూమ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే.

10 లక్షల మంది కోసం హోస్ట్ చేసే వారు వన్ టైమ్ వెబ్‌నార్ ధర లక్ష డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ. 84 లక్షలు. అయితే బయట ఇత మందితో మీటింగ్ నిర్వహించాలంటే ఇంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.





























