- Telugu News Photo Gallery Technology photos These are the new phones available in the market, check details in telugu
Best phones: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా.?జూలైలో మార్కెట్ ఉన్న బెస్ట్ మోడళ్లు ఇవే..!
ఆధునిక కాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరికీ సవాల్ గా మారింది. మార్కెట్ లో దొరుకుతున్న అనేక రకాల మోడళ్లలో ఒకదానికి ఎంపిక చేసుకోవడం చాలా కష్టం. బ్రాండ్, ధర, ఫీచర్లు, పనితీరు.. ఇలా అన్నింటిలో బెస్ట్ ఫోన్ కావాలంటే దానికి తగిన పరిశీలన చాలా అవసరం. ఎందుకంటే మార్కెట్ లోకి రోజుకో కొత్త ఫోన్ విడుదలవుతోంది. ఒకదాని ఫీచర్లు, ప్రత్యేకతలు తెలుసుకుని, దాన్ని కొనాలనుకునేలోపు మరో ఫోన్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో జూలై లో మార్కెట్ లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లు, వాటి ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 04, 2025 | 3:21 PM

ఆధునిక ఫీచర్లు, కొత్త టెక్నాలజీ కోరుకునే వారికి వన్ ప్లస్ 13ఎస్ చాలా బాగుంటుంది. ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునే వారికి సరిపోతుంది. వన్ ప్లస్ 13ఎస్ ఫోన్ ధర రూ.54,999 కాగా, అందుబాటులోని బ్యాంకు ఆఫర్లను వినియోగించుకుని రూ.49,999కి పొందవచ్చు. దీనిలో 6.32 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 80 వాట్స్ ఫాస్ వైర్డ్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,850 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

తక్కువ ధరకు మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ కోరుకునే వారికి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో చక్కగా సరిపోతుంది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభమవుతుంది. 6.77 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, టెలిఫోటో లెన్స్ తో కూడిన 50 మెగా పిక్సల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, ఎసెన్షియల్ కీ, డైమెన్సిటీ 7300 ప్రో చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ నవీకరణలు, ఆరేళ్ల పాటు భద్రత పీఛర్లు పొందుతారు.

ఆపిల్ కంపెనీ విడుదల చేసే ఐఫోన్ ను ఇష్టపడని వారు దాదాపు ఎవ్వరూ ఉండరనే చెప్పాలి. మార్కెట్ లోకి ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా, ఐఫోన్ కు డిమాాండ్ ఏమాత్రం తగ్గదు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16ఈ కొత్త ఫీచర్లతో ముందుకు వచ్చింది. దీని ధర రూ.53 వేలు పలుకుతోంది. ఐఫోన్ 16 మాదిరిగానే ఏ18 చిప్ ద్వారా శక్తి పొందుతుంది. పనితీరు విషయంలో సూపర్ అని చెప్పవచ్చు. కెమెరా, సాఫ్ట్ వేర్ చాలా బాగున్నాయి.

వేగవంతమైన పనితీరు కలిగిన ఫోన్ కొనాలనుకునే వారికి ఐక్యూఓ 13 మంచి ఎంపిక. దీనిలో అమోలెడ్ డిస్ ప్లే, 16 జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం నలభై నిమిషాల్లో పూర్తిస్థాయి చార్జింగ్ అవుతుంది. గేమర్లకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఐక్యూఓ13 స్మార్ట్ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

మిడ్ రేంజ్ ఫోన్లలో నథింగ్ ఫోన్ 3ఏ ప్రో అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. లుక్, డిజైన్ పరంగా సూపర్ గా కనిపిస్తోంది. దీనిలో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్, 12 జీబీ ర్యామ్, వెనుక వైపు 50 మెగా పిక్సల్ ప్రధాన సెన్సార్, 50 ఎంపీ పెరిస్కోప్ లెన్స్ బాగున్నాయి. ఈ ఫోన్ రూ.35 వేల కంటే తక్కువ ధరకు లభిస్తోంది.



















