5G Smart Phones: 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 20 వేల లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే..
5G Smart Phones: ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలు ప్రారంభంకావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 5జీ ఫోన్‌లను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. మరి రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Feb 12, 2022 | 9:06 PM

Realme Narzo 30 5g: రియల్ మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Realme Narzo 30 5జీ: రియల్ మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Realme x7 5g: ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 800 యూ 5జీ ప్రాసెసర్‌ను అందించారు. 6.4 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. ఇందులో 64 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ప్రారంభం ధర రూ. 19,999గా ఉంది.

Vivo t1 5g: ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,990గా ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు.

Realme 8s 5g: ఈ ఫోన్‌లో 90 హెర్జ్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 17,999కి అందుబాటులో ఉంది.




