Telugu News Photo Gallery Technology photos Smarter with these smartphones, These are the best looking phones in the price of 30 thousand, Best phones under 30k details in telugu
Best phones: ఈ స్మార్ట్‌ఫోన్స్‌తో మరింత స్మార్ట్.. 30 వేల ధరలో బెస్ట్ లుకింగ్ ఫోన్లు ఇవే..!
మార్కెట్ లోకి ప్రతి రోజూ అనేక కంపెనీలకు చెందిన వివిధ మోడళ్ల ఫోన్లు విడుదల అవుతున్నాయి. పనితీరు, ఫీచర్లు, నాణ్యత, బ్యాటరీ సామర్థ్యం తదితర విషయాలలో ఒకదానికి మించి మరొకటి ఉంటున్నాయి. వివిధ రకాల డిజైన్లతో ఆకట్టుకుంటున్నాయి. అయితే చాలామంది వినియోగదారులు సింపుల్ లుక్ లో ఉండే ఫోన్లను ఇష్టపడతారు. ఎలాంటి హడావుడి లేకుండా ఉండే మంచి ఫోన్ల కోసం ఎదురు చూస్తారు. అలాంటి వారి కోసం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో బెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగిన ఫోన్లు అందుబాదులో ఉన్నాయి. ఒప్పో, రియల్ మీ, మోటరోలా, వన్ ప్లస్ కంపెనీలకు చెందిన ఫోన్లు రూ.30 వేల లోపు ధరలో లభిస్తున్నాయి. వాటి ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.