Google Maps: మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్ముతున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..
గూగుల్ మ్యాప్స్ ఎంత మేలు చేస్తుందో అదే సమయంలో కొన్ని సమస్యలను కూడా తెచ్చి పెడుతోంది. తాజాగా జరుగుతోన్న సంఘటనలే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. ఉత్తర్‌ప్రదేశ్ బరెలీ జిల్లాలో మ్యాప్స్‌లో చూస్తున్న వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బ్రిడ్జ్ కూలిన విషయం మ్యాప్స్‌లో అపడ్‌డేట్ కాకపోవడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
Updated on: Nov 25, 2024 | 9:47 PM

గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించే సమయంలో కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ప్రమాదాలు తప్పవని జరుగుతోన్న సంఘటనలే హెచ్చరిస్తున్నాయి. అందుకే మ్యాప్స్ ఉపయోగించే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.

మ్యాప్స్‌ను పూర్తిగా నమ్మకూడదని చెబుతున్నారు. మీరు ఏదైనా ప్రదేశానికి కొత్తగా వెళ్తుంటే కచ్చితంగా స్థానికంగా ఉన్న ప్రజల సూచనలు తీసుకోవాలి. ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే ప్రజలను అడగడం ఉత్తమం.

ఇతరుల సలహాలు తీసుకుంటూ మ్యాప్స్‌లో చూపిస్తున్న మార్గాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. మ్యాప్స్ యాప్‌ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ వెర్షన్ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఏవైనా మార్పులు ఉంటే ముందే గమనించవచ్చు.

ఇక మనం మ్యాప్స్‌లో మనం వెళ్లే మార్గాన్ని సెట్ చేసుకోగానే వెంటే మొత్తం రూట్ చూపిస్తుంది. ముందుగానే మార్గం మొత్తాన్ని గమనించాలి. అందులో రోడ్డు ఏమైనా డ్యామెజ్ ఉందా. మట్టి రోడ్డు ఉందా.? ఏవైనా రిపేర్స్ అవుతున్నాయా లాంటి వివరాలను గమనించాలి.

అలాగే మ్యాప్స్ ఆధారంగా ప్రయణిస్తున్న సమయంలో మీ పక్కన వాహనాలు వెళ్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా గమనించాలి. ఎక్కువగా వాహనాల సంచారం లేకపోతే ఆ రోడ్డు బాగా లేదని, లేదా మూసి వేశారనే విషయాన్ని గుర్తుపుట్టుకోవాలి.




