- Telugu News Photo Gallery Technology photos Nokia launches new feature phone Nokia 2780 phone, Check here for features and price
Nokia 2780: నోకియా నుంచి మరో సూపర్ ఫీచర్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే..
ఓవైపు స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోన్న ప్రస్తుత తరుణంలో ఫీచర్ ఫోన్‌లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి ఇప్పటికే ఫీచర్ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 25, 2024 | 9:24 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా 2780 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2.7 ఇంచెస్‌తో కూడిన QVGA డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్ మోడల్‌లో తీసుకొచ్చారు.

ఫోన్‌ను ఫోల్డ్ చేసిన తర్వాత అవుటర్ డిస్‌ప్లేను 1.77 ఇంచెస్‌తో ఇచ్చారు. ఈ ఫోన్‌ను బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్ 4జీ వోల్ట్‌కు సపోర్ట్ చేస్తుంది. వైఫైకి కూడా కనెక్ట్ చేసుకోవడం ఈ ఫోన్ విశేషం.

బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటి ఆప్షన్స్‌ను అందించారు. ఇందులో యూట్యూబ్, మ్యాప్స్ వంటివి యాక్సెస్ చేసుకోవచ్చు. నోకియా 2780 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు.

మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. tures

ఇక ఇందులో 1450 ఎమ్‌హెచ్ కెపాసిటీతో కూడిన రిమూవబుల్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 18 రోజుల స్టాండ్ బై అందిస్తుంది. అలాగే 7 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ధర విషయానికొస్తే రూ. 6 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.




