- Telugu News Photo Gallery Technology photos Samsung Give Big Discount On Galaxy F62 Smartphone Have Look On Features And Price Details
Samsung Galaxy F62: శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌పై బంపరాఫర్.. ఏకంగా రూ. 6000 తగ్గింపు. ఫీచర్లు కూడా సూపర్..
Samsung Galaxy F62: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసాంగ్ తన వినియోగదారుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. గ్యాలక్సీ ఎఫ్ 62 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 6 వేల వరకు తగ్గింపు ధరను ఇచ్చింది. ఇక ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 07, 2021 | 8:36 PM

శాంసంగ్ తన యూజర్ల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. గ్యాలక్సీ ఎఫ్ 62 స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 6000 తగ్గించి. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ అసలు ధర రూ. 23,999 కాగా తగ్గింపు ధరతో రూ. 17,999కే అందుబాటులోకి వస్తుంది. ఇక 8 జీబీ వేరియంట్ ధర రూ. 25, 999 కాగా ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 19, 999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2400) సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ- ఓ డిస్‌ప్లేతో అందించారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Exynos 9825 ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌ను 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పాటు 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.





























