- Telugu News Photo Gallery Technology photos Realme launches new smartphone Realme C31 features and price details
Realme C31: రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది… రూ. 8 వేలలో అదిరిపోయే ఫీచర్లు..
Realme C31: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గం రియల్‌మీ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ సీ31 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియాలో విడుదల కాగా మార్చి 31న భారత మార్కెట్లోకి రానుంది..
Updated on: Mar 27, 2022 | 8:16 AM

ఇటీవల వరుస స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న రియల్‌మీ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీ సీ31 పేరుతో ఇప్పటికే ఇండోనేషియాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 31న భారత మార్కేట్లోకి రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.

6.5 ఇంచెస్ హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఆప్షన్లు అందించారు.

కెమెరా విషయానికొస్తే 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. పవర్ బటన్‌కే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ మరో ప్రత్యేకత.

3 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 8,500కి అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో కూడా ఈ ఫోన్ రానుంది.




