- Telugu News Photo Gallery Technology photos Realme launches new smart phone, Have a look on realme 9 phone features and price details
Realme 9 5g: భారత మార్కెట్లోకి రియల్‌మీ కొత్త ఫోన్.. రూ. 15వేలలోపే ఆకట్టుకునే ఫీచర్లు..
Realme 9 5g: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లొకి రియల్ మీ 9 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. తక్కువ ధరలో ఆకట్టుకునే ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 14, 2022 | 7:09 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రియల్‌మీ 9 స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది.

ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫీచర్లు విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసరత్‌తో నడుస్తుంది.

ధర విషయానికొస్తే రియల్ మీ 9 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉండగా, 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉంది.

తక్కువ ధరలో ఎక్కువ కెమెరా క్లారిటీ ఈ ఫోన్ సొంతం. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 11+ రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.




