- Telugu News Photo Gallery Technology photos Power packed phones at a price of ten thousand, What are the features, Smart Phones under 10k details in telugu
Smart Phones: పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో వచ్చే స్మార్ట్ ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం పది వేల ధరలోనే 5 జీ ఫోన్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పది వేల ధరలో అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Dec 14, 2024 | 4:50 PM

ఐక్యూ జెడ్ 9 లైట్ ఫోన్ బడ్జెట్ ఫోన్స్‌లో రారాజుగా నిలుస్తుంది. ఐపీ 64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఈ ఫోన్ ప్రత్యేకత. 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ద్వారా పని చేసే ఈ ఫోన్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్ల కారణంగా ఈ ఫోన్ అమ్మకాల్లో రికార్డులను సృష్టిస్తుంది.

మోటరోలా జీ45 ఫోన్ 5జీ స్టాండ్‌అవుట్ బడ్జెట్ ఫోన్ అని నిపుణులు చెబుతున్నారు. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఆకర్షిస్తుంది. స్నాప్ డ్రాగన్ 6 ఎస్ జెన్3 ప్రాసెసర్‌తో మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటున్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంది.

రెడ్ మీ 13 సీ 5జీ ఫోన్ ధర రూ.10,999కు అందుబాటులో ఉంటుంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్‌తో ఆధారంగా పని చేస్తుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

రెడ్ మీ ఏ4 5జీ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5,160 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ కెమెరా మరింత ఆకట్టుకుంటుంది.

వివో టీ3 లైట్ ఫోన్ 5జీ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటుంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఆకర్షిస్తుంది. ఈ ఫోన్ రోజువారీ పనులకు సరిగ్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ గేమింగ్‌కు అనువైనది కాదు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 8 ఎంపీ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.





























