- Telugu News Photo Gallery Technology photos Noise launches new wireless ear buds Noise vs106 features and price details Telugu Tech News
Noise vs106: ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాన్ స్టాప్‌గా 50 గంటలు పనిచేస్తుంది.. నాయిస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్
ప్రస్తుతం మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు భారీగా ఉన్న ఇయర్ బడ్స్ ధరలు తాజాగా భారీగా తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు తగ్గాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ నాయిస్ మార్కెట్లోకి కొత్త ఈయర్ బడ్స్‌ని లాంచ్ చేశారు. నాయిస్ వీఎస్ 106 పేరుతో ఈ లాంచ్ చేసిన వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బడ్స్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 50 గంటలు పనిచేస్తుంది. ఇంతకీ ఈ ఇయర్ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 21, 2023 | 3:55 PM

నాయిస్ వీ106 పేరుతో తీసుకొచ్చిన ఈ ఇయర్ బడ్స్‌ను ట్రూ వైర్‌లెస్ స్టీరియో టెక్నాలతో రూపొందించారు. అన్ని ఈ కామర్స్ సైట్స్‌లో అందుబాటులో ఉన్న ఈ ఇయర్ బడ్స్ ఖరీదు రూ. 1299గా ఉంది.

ఈ ఇయర్ బడ్స్‌ను కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు ఏకంగా 200 నిమిషాలు ప్లేటైమ్‌ను అందిస్తుంది. 10ఎమ్‌ఎమ్ డ్రైవర్‌ను అందించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

నాయిస్ వీ106లో హైపర్ సింక్ టెక్నాలజీతో కూడిన బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని అందించారు. గేమ్స్ కోసం ప్రత్యేకంగా గేమింగ్ మోడ్‌ను అందించారు.

ఇక యూజర్లకు బెస్ట్ సౌండ్ క్వాలిటీ అందించడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్వాడ్ మైక్ సిస్టమ్, ఈఎన్‌సీ ఫీచర్‌ను ఇచ్చారు. ఈ ఇయర్ బడ్స్ సిరి, గూగుల్ అసిస్టెంట్‌లకు సోపర్ట్ చేస్తుంది.

యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్‌ను అందించారు. చార్జింగ్ కేస్‌తో కలిపి చార్జ్‌పై మొత్తం 50 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి.





























