- Telugu News Photo Gallery Technology photos Motorola launching edge 2023 in india soon, Check here for features and price details
Edge 2023: మోటోరోల నుంచి మరో స్టన్నింగ్ ఫోన్.. POLED డిస్‌ప్లే ప్రత్యేకతతో..
మోటోరోలో మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మోటో ఎడ్జ్ 2023 పేరుతో ఈ పేరును లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా మోటో ఎడ్స్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 23, 2023 | 1:14 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం మోటోరోలో తాజాగా మార్కెట్లోకి మోటో ఎడ్జ్ 2023 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం అమెరికాలో లాంచ్ అయిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగపెట్టనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర భారత్‌లో లాంచింగ్ సమయానికి రూ. 49,000 ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక మోటో ఎడ్జ్ 2023 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. పీఓఎల్‌ఈడీ, హెచ్‌డీఆర్10+ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

మోటో ఎడ్జ్ 2023 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో మీడియోటెక్ డైమెన్సిటీ 7030 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్‌ను ఇందులో ఇచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు, 5 వాట్స్ రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 30 గంటల ప్లైటైమ్ ఇస్తుంది.





























