- Telugu News Photo Gallery Technology photos Motorola Launches New Smart Phone G51 Have a Look On Features And Price
Moto G51: మొటోరోలా నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..
Moto G51: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మొటోరోలా తాజాగా మొటో జీ51 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది..
Updated on: Nov 04, 2021 | 1:22 PM

ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న మొటోరోలో తాజాగా మోటో జీ51 పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. బుధవారం చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లోకి రానుంది.

8జీబీ+128 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఈ ఫోన్ ధర భారత్‌లో రూ. 17,500కు లభించనున్నట్లు చైనీస్ బ్లాగర్ ఒక తెలిపింది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..ఇందులో 6.8 అంగులా హోల్ పంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో కూడిన 120 హెచ్‌జెడ్ స్క్రీన్‌ను అందించారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 10 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరాను అందించారు. వీటిలో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిల్క్సె, 2 మెగా పిక్సెల్ కెమెరాలను అందిచారు.




