- Telugu News Photo Gallery Technology photos Motorola launches Moto g72 smartphone with 108 megapixel camera have a look on full features and price details Telugu Tech News
Moto g72: మోటోరోలా నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. 108 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్లు..
మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటో జీ72 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ అక్టోబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్ ప్రారంభం కానున్న ఈ ఫోన్‌కు సంభవించిన ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 30, 2022 | 12:33 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటో జీ72 పేరుతో రానున్న ఈ ఫోన్ అక్టోబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 576 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన పోలెడ్ డిస్‌ప్లేను అందించనున్నారు. HDR10 సపోర్ట్, గరిష్టంగా 1300 nits బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈస్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం.

కెమరా విషయానికొస్తే ఇందులో 108 మెగా పిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

33 వాట్స్ టర్బో పవర్ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. IP52 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ప్రొటక్షన్‌త ఈ ఫోన్ పని చేస్తుంది.





























