- Telugu News Photo Gallery Technology photos Is some one stolen your phone recover your whatsapp in this way
మీ ఫోన్ దొంగలించబడిందా.? వాట్సాప్ ఎవరైనా ఉపయోగిస్తున్నారని సందేహమా.! డోంట్ వర్రీ.. ఇలా చేయండి..
వాట్సాప్ చాట్.. యూజర్ వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. మీ ఫోన్ పోయినట్లయితే, మీ ఖాతా, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావచ్చు.
Updated on: May 15, 2021 | 3:35 PM

మీ వాట్సాప్ ఖాతాను ఎవరైనా ఉపయోగిస్తున్నారని మీరు సందేహపడుతుంటే.. అది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం..

మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే.. మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ వాట్సాప్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయలేని విధంగా మీ సిమ్ కార్డును లాక్ చేయండి.

మీరు మీ సిమ్ కార్డును లాక్ చేసిన తర్వాత, మీ ఫోన్‌లో వాట్సాప్‌ను యాక్టివేట్ చేయడానికి అదే నంబర్‌తో కొత్త సిమ్ కార్డ్ అవసరం.

ఖాతాను డియాక్టివ్ చేయాలంటే మీరు కంపెనీకి ఈ-మెయిల్ పంపాలి. మీరు మెయిల్‌లో ప్రధానంగా "Lost/Stolen: Please Deactivate My Account", మీ నెంబర్ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.

ఖాతా డియాక్టివ్ అయిన తర్వాత, 30 రోజులు వరకు, మీకు పరిచయంలో ఉన్న వ్యక్తులు మీ ప్రొఫైల్‌ను చూడగలరు. అంతేకాకుండా సందేశాలను పంపించగలరు. మీరు ఖాతాను మళ్లీ యాక్టివ్ చేసిన తర్వాత, పెండింగ్‌లో ఉన్న మెసేజ్‌లను న్యూ డివైజ్‌లోకి పునరుద్ధరించవచ్చు. అయితే, మీరు 30 రోజుల్లోపు మీ ఖాతాను యాక్టివ్ చేయకపోతే, అప్పుడు ఈ డేటా తొలగించబడుతుంది.




