- Telugu News Photo Gallery Technology photos IQOO 11 smartphone sales begin in india. Have a look on features and price details Telugu Tech News
iQOO 11: భారత్‌లో అందుబాటులోకి వచ్చేసిన ఐక్యూ 11 స్మార్ట్‌ఫోన్.. ఏం ఫీచర్లు గురూ..
టెక్ అభిమానులు ఎన్నటి నుంచో ఎదురు చూస్తోన్న ఐక్యూ 11 భారత మార్కెట్లోకి వచ్చేసింది. ప్రీమియం బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 13వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది..
Updated on: Jan 14, 2023 | 12:47 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి ఐక్యూ 11 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనవరి 13వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఐక్యూ 11 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ. 59,999గా ఉండగా, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరయింట్ ధర రూ. 64,999గా ఉంది. అయితే ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌కి లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 2K E6 ప్యానెల్‌తో వస్తోన్న తొలి మొబైల్ ఇదే కావడం విశేషం.

కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ సామ్‌సంగ్ GN5 లెన్స్, 13-MP టెలిఫోటో లెన్స్, 8-MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, స్పాట్‌లెస్ సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు 16 మెగాపిక్సెల్ స్నాపర్‌ను అందించారు.

బెస్ట్ గేమింగ్ అనుభూతిని అందించేందుకు డ్యూయల్ x-లీనియర్ మోటార్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందించారు.




