- Telugu News Photo Gallery Technology photos Lenovo launches new premium 5g Tab. lenovo tab p11 features and price details Telugu Tech news
Lenovo Tab P11: లెనోవో నుంచి కొత్త 5జీ ట్యాబ్.. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి సూపర్ ఫీచర్లు..
లెనోవో భారత మార్కెట్లోకి తన ప్రీమియం ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. లెనోవో ట్యాబ్ పీ 11 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్‌లో మంచి ఫీజర్లను అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఈ ట్యాబ్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు...
Updated on: Jan 15, 2023 | 7:57 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ లెనోవో తాజాగా కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. లెనోవో పీ 11 అనే పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయడం విశేషం. లెనోవో నుంచి వచ్చిన తొలి ప్రీమియం ట్యాబ్ ఇదే.

ధర విషయానికొస్తే.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఈ ట్యాబ్‌లో బ్యాటరీకి పెద్ద పీట వేశారు. 7700 ఎంఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటలపాటు నాన్‌స్టాప్‌గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

ఈ ట్యాబ్‌లో క్వాల్కమ్ స్నాప్‌డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 11 ఇంచెస్ 2కే ఐపీఎస్టచ్స్క్రీన్తో దీనిని రూపొందించారు. వైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్‌ని ఇన్‌సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు.

డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఈ ట్యాబ్ ప్రత్యేకగా చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 4 జేబీఎల్ స్పీకర్లు ఈ ట్యాబ్ సొంతం.




