- Telugu News Photo Gallery Technology photos Infinix launches new smart phone Infinix smart 8 features and price details
Infinix Smart 8: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. రూ. 9 వేలలోపు ఎన్నో ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఇన్‌ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ను నైజీరియాలో లాంచ్ చేసింది. అయితే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందన్నదానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 13, 2023 | 10:03 PM

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 9 వేలలోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్టల్ గ్రీన్, గెలాక్సీ వైట్, టింబర్ బ్లాక్, షైనీ గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇక ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లేలో అందించారు. 4 జీబీ ర్యామ్‌ను అందించారు. దీనిని 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఏఐ అసిస్టెడ్ ఈ కెమెరా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో.. డ్యూయల్ సిమ్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు

ఇక ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనకవైపు అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ సొంతం. వెనకవైపు ట్రాన్స్‌పరెంట్ ఎఫెక్ట్ అందించే బ్యాక్ ప్యానెల్ అందించారు.





























