- Telugu News Photo Gallery Technology photos Increasing use of laptops, These are the best laptops under 30 thousand, best laptops details in telugu
Best Laptops: పెరుగుతున్న ల్యాప్‌టాప్ వినియోగం.. రూ. 30 వేల లోపు ది బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే..!
భారతదేశంలో కరోనా లాక్‌డౌన్ తర్వాత ల్యాప్‌టాప్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ల్యాప్‌టాప్ అనేది తప్పనిసరైంది. అలాగే పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులతో పాటు ప్రాజెక్ట్ వర్క్‌లకు కూడా ల్యాప్‌టాప్‌లు అవసరం కావడంతో వీటి కొనుగోలుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ల్యాప్‌టాప్‌ల ధరలు అధికంగా ఉండడంతో సగటు మధ్యతరగతి కొనుగోలుదారుడు తక్కువ ధరలో అన్ని ఫీచర్లతో వచ్చే ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉండేలా రూ.30,000 లోపు అందుబాటులో ఉండే ల్యాప్‌టాప్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Feb 22, 2024 | 6:30 PM

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ ఇంటె సెలెరాన్ ఎన్ 4020 4వ జెన్ 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 8 జీబీ+ 256 జీబీ ఎస్ఎస్‌డీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ రెండు సంవత్సరాల వారెంటీతో వస్తుంది.

టెక్నో మెగా బుక్ టీ 1 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే ఇంటెల్ కోర్ 11వ జెన్ ఐ5 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల ఐ కంఫర్ట్ డిస్‌ప్లేతో 14.8 ఎంఎం అల్ట్రా స్లిమ్ డిజైన్, బలమైన 70 డబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీతో పని చేస్తుంది. సొగసైన మూన్‌షైన్ సిల్వర్ కలర్‌లో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 1.56 కిలోల బరువు ఉంటుంది.

ఆసస్ వివో బుక్ 15 కూడా మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఉంటుంది. ఇంటెల్ సెలిరాన్ ఎన్ 4020 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్‌తో అందుబాటులో ఉంటుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ అదనపు భద్రత కోసం వేలిముద్ర సెన్సార్‌ను కలిగి ఉంది. కేవలం 1.8 కిలోల బరువుతో వస్తుంది.

లెనోవో ఐడియా ప్యాడ్ వన్ ఏఎండీ రైజన్ 2 7320యూ పోర్టబుల్ ల్యాప్‌టాప్ రూ.30 వేల లోపు అనువైన ల్యాప్‌టాప్‌గా ఉంటుంది. ఈ లెనెవో ల్యాప్‌టాప్ 8 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. విండోస్ 11 హోమ్ ద్వారా పని చేసే ఈ ల్యాప్‌టాప్ బరువు 1.58 కిలోల వరకూ ఉంటుంది. సరికొత్త కంప్యూటింగ్ ఫీచర్‌లతో పాటు క్లౌడ్ గ్రే ఫినిషింగ్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

జిబ్రానిక్స్ ఎన్‌బీసీ 1 ఎస్ కోర్ ఐ3 11వ జెనరేషన్‌తో వస్తుంది. 8 జీబీ + 512 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ వచ్చే ఈ ల్యాప్‌టాప్ సున్నితమైన పనితీరు కోసం రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్‌లో రన్ అవుతుంది. 15.6 అంగుళాల 1080 పీ డిస్‌ప్లే, యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్, అదనపు భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్లతో వస్తుంది. 38.5 డబ్ల్యూహెచ్ బ్యాటరీ ద్వారా పని చేస్తుంది.




