- Telugu News Photo Gallery Technology photos Huge discount on nothing phone 2 in flipkart GOAT sale, Check here for full details
Nothing Phone 2: నథింగ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ. 16 వేల తగ్గింపు..
ఓవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో భారీ సేల్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ సైతం 'గోట్' GOAT పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 18, 2024 | 8:47 PM

లండన్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ 2ని గతేడాది లాంచ్ చేసిన విషయం తెలిసిందే. నథింగ్ ఫోన్2 లాంచింగ్ సమయంలో ధర రూ. 44,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.16,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని బ్యాంక్ ఆఫర్లను కలుపుకుంటే ఈ ఫోన్ రూ. 28,999కే లభిస్తోంది. దీంతో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోడం ద్వారా కూడా అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

నథింగ్ ఫోన్ 2 ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌లో 4700 ఎమ్‌ఏహెచ్ లిథియం ఐయాన్ బ్యాటరీని అందించారు

ఈ స్మార్ట్ ఫోన్‌లో స్ప్లాష, వాటర్ అండ్ డస్ట్ రెస్టిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే ఫేస్, ఫిగర్ అన్‌లాక్ ఫీచర్‌ను ఇచ్చారు. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్5ని అందించారు.




