ఈ స్మార్ట్ ఫోన్‌ను మూడు స్టోరేజీ వేరియంట్లలో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.21,499, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా అన్ని ఆఫర్స్ కలుపుకొని రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.