- Telugu News Photo Gallery Technology photos Hong kong mobile company tecno bring ecno camon 17 and 17 pro mobiles features and price details
Tecno Camon Phones: కొత్తగా రెండు ఫోన్లను లాంచ్ చేసిన టెక్నో.. ప్రారంభ ధర రూ. 12,999.. డిస్కౌంట్ కూడా.
Tecno Camon Phones: హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ టెక్నో తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 17, 2021 | 12:42 PM

హాంగ్‌కాంగ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో తాజాగా భారత మార్కెట్లోకి కొత్తగా రెండు ఫోన్లను లాంచ్ చేసింది. టెక్నో కేమన్ 17, టెక్నో కేమన్ 17 ప్రో పేర్లతో ఈ ఫోన్‌లను లాంచ్ చేశారు. జులై 26 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.

టెక్నో కేమన్ 17 ఫోన్‌లో 6.8 ఇంచుల ఫుల్హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ805 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 128 జీబీ ఇంటర్నల్ మెమొరీని అందించిన ఈ ఫోన్‌కు 256 ఎక్స్‌టెండెబుల్ మెమొరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే.. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

టెక్నో కేమన్ 17 ప్రో ఫీచర్ల విషయానికొస్తే.. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11పై పనిచేయనుంది. ఇందులో 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హెలియో G95 SoC ప్రాసెసర్ ఈ ఫోన్ సొంతం.

కెమెరా విషయానికొస్తే 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 48 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే.. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

టెక్నో కేమన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 16,999 ఉండగా.. కేమన్ 17 ప్రారంభ ధర రూ. 12,999గా ఉంది. ఇక ఈ ఫోన్లపై ఆఫర్‌లో భాగంగా రూ. 1,999 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే మరో 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.




