- Telugu News Photo Gallery Technology photos Flipkart offering huge discount on infinix 43 inch smart tv
రూ. 27 వేల స్మార్ట్ టీవీ రూ. 17 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. 43 ఇంచెస్‌తో పాటు ఎన్నో సూపర్ ఫీచర్స్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీపై అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేలవలం రూ. 15,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ ఈ టీవీ ఏంటి.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: May 29, 2023 | 9:30 PM

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీపై అద్భుత ఆఫర్‌ను అందిస్తోంది. ఇన్‌ఫినిక్స్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ అసలు ఏంటీ ఆఫర్.? ఈ టీవీలో ఉన్న ఫీచర్స్ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 26,999కాగా 37 శాతం డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్ రూ. 16,999కి అందిస్తోంది. అలాగే క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

దీంతో ఈ స్మార్ట్ టీవీని రూ. 15,749 వేలకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా మరో రూ. 11 వేల డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 4700కే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఈ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 20 వాట్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి పలు యాప్స్ వీక్షించొచ్చు. డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.




