- Telugu News Photo Gallery Technology photos Flipkart month end mobile fest huge discount on CMF phone 1
CMF: సీఎమ్‌ఎఫ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 6వేల వరకు..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు అందిస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు గ్రేట్ ఫ్రీడ్ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్లిప్‌కార్ట్.. 'మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్' పేరుతో మొబైల్ ఫోన్‌పై డిస్కౌంట్ అందిస్తున్నారు. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సేల్ ఉండనుంది..
Updated on: Aug 21, 2024 | 10:32 AM

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో భాగంగానే లండన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నథింగ్ బ్రాండ్‌కు చెందిన సీఎమ్‌ఎఫ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు.

సీఎమ్‌ఎఫ్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,999గా ఉండగా సేల్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,999కి లభిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌పై దాదాపు రూ. 6 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఎస్‌డీ కార్డు ద్వారా 2 జీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించార. ఈ స్మార్ట్ ఫోన్ 730 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.




