Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. అన్ని రకాల వస్తులపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. మరి స్మార్ట్ ఫోన్‌లపై ఈ సేల్‌లో ఎలాంటి డిస్కౌంట్స్ ఉన్నాయో ఓసారి చూసేయండి..
అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ కూడా ఆఫర్లతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) పేరుతో ఆఫర్లు అందిస్తోంది. మార్చి 16తో ముగియనున్న ఈ సేల్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు ఉన్నాయి.
1 / 5
ఈ సేల్‌లో ఎస్‌బీఐతో క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనం 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లను సైతం అందిస్తోంది. ఇక ఈ సేల్‌లో మొబైల్ ఫోన్స్‌పై ఉన్న కొన్ని ఆఫర్లపై ఓ లుక్కేయండి.
2 / 5
ఐఫోన్ ఎస్‌ఈ (2020)ను ఈ సేల్‌లో కేవలం రూ. 29,999కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియెంట్స్‌లో అందుబాటులో ఉంది.
3 / 5
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తక్కువ ధరకు వస్తున్న మరో ఫోన్ పోకో ఎమ్3 ప్రో 5జీ. ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 12,249, 128 జీబీ స్టోరేజ్ రూ. 14,249కి అందుబాటులో ఉంది.
4 / 5
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ 64 జీబీ ర్యామ్ మోడల్ రూ. 19,749కి సొంతం చేసుకోవచ్చు. కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 750 డిస్కౌంట్ లభిస్తుంది. వీటితో పాటు రియల్‌మీ నార్జో 30, షావోమీ, వివో వంటి ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.