- Telugu News Photo Gallery Technology photos Dizo launches new two smart watches in india DIzo ultra and dizo pro features and price details Telugu Tech News
DIZO Watch: డిజో నుంచి మార్కెట్లోకి రెండు కొత్త వాచ్‌లు.. స్టన్నింగ్ లుక్, మెస్మరైజ్ ఫీచర్లు..
టెక్ కంపెనీ డిజో భారత మార్కెట్లోకి తాజాగా రెండు కొత్త స్మార్ట్ వాచ్లను లాంచ్ చేసింది. డిజో వాచ్ డి ప్రో, డిజో వాచ్ డి అల్ట్రా పేర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌లలో అదిరిపోయే ఫీచర్లను తీసుకొచ్చారు..
Updated on: Jan 10, 2023 | 1:50 PM

ప్రముఖ గ్యాడ్జెట్ సంస్థ డిజో భారత్‌లో రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసింది. డిజో వాచ్ డీ ప్రో, డీజో వాచ్ డీ అల్ట్రా పేర్లతో తీసుకొచ్చిన ఈ వాచ్ ధరలు కూడా అందుబాటులో ఉండడం విశేషం.

డిజో వాచ్ డి ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ స్క్రీన్‌ను అందించారు. 110 స్పోర్ట్స్ మోడల్స్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. 150కిపైతా వాచ్ ఫేస్‌లను అందించనున్నారు.

ఇక ఈ డిజో వాచ్ డి ప్రోలో కెమెరా కంట్రోల్, షటర్ బటన్, అలారం, బ్లూటూత్ కాలింగ్‌తో పాటు డు నాట్ డిస్ట్రబ్ మోడ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, సిల్వర్, గ్రే, లైటింగ్ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.

డిజో వాచ్ డి అల్ట్రా ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్‌లో 1.78 ఇంచెస్ అమోఎల్‌ఈడీ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. 270 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ వాచ్ సొంతం. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వ్‌డ్ టాంపర్డ్ గ్లాస్‌ను ఇచ్చారు. 100కిపైగా స్పోర్ట్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్‌లో ఫోన్ కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, అలారం ఫైండ్ మొబైల్, ఫైండ్ వాచ్, మెసేజింగ్ నోటిఫికేషన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర విషయానికొస్తే డిజో డీ అల్ట్రా స్మార్ట్ వాచ్ ధర రూ. 3,299 కాగా, డిజో డీ ప్రో స్మార్ట్ వాచ్ ధర రూ. 2699గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిజో డీ అల్ట్రా వాచ్ జనవరి 12వ తేదీ నుంచి, డిజో వాచ్ డి ప్రో జనవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.





























