- Telugu News Photo Gallery Technology photos Best vacuum cleaners under 3000, Check here for features and price
Vacuum cleaner: ఆఫర్స్ అంటే ఇలా ఉండాలి.. తక్కువ ధరకే బెస్ట్ వాక్యూమ్ క్లీనర్‌లు. ఫీచర్స్ కూడా సూపర్..
ఒకప్పుడు వాక్యూమ్ క్లీనర్స్ అంటే కేవలం ధనవంతుల ఇళ్లలో ఉండే వస్తువు అనుకునే వారు. అది ఒక విలాసవంతమైన వస్తువనే భావన ఉండేది. అయితే మారుతోన్న కాలానికి అనుగుణంగా వాక్యూమ్ క్లీనర్స్ ధర భారీగా తగ్గింది. దీంతో మధ్య తరగతికి చెందిన వారు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వాక్యూమ్ క్లీనర్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Oct 06, 2023 | 12:34 PM

Eureka fobres: తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌తో కూడిన వాక్యూమ్ క్లీనర్స్‌లో యూరేకా ఫోర్బ్స్‌కి చెందిన ప్రొడక్ట్ (EUREKA FORBES Quick Clean DX Dry Vacuum Cleaner with Reusable Dust Bag) బెస్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ క్లీనర్ అసలు ధర రూ. 4,499కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,979కే అందుబాటులో ఉంది. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ వాక్యూమ్ క్లీనర్స్ ఫీచర్స్ విషయానికొస్తే దీనిని ఈజీగా మూవ్ చేసే విధంగా రూపొందించారు. సౌండ్ కేవలం 85 డీబీకావడం విశేషం. అలాగే ఇందులో 1.5 కెపాసిటీతో కూడిన డస్ట్ బ్యాగ్‌ను అందించారు.

Agro Regal: సోఫాలు, కిటీకీలు వంటి వాటిని క్లీన్ చేయడానికి అగ్రో రీగల్ కంపెనీకి చెందిన AGARO Regal Hand-held Vacuum Cleaner వ్యాక్యూమ్ క్లీనర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. దీని ధర కూడా కేవలం రూ. 1599కావడం విశేషం. ఐసీసీఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ప్రొడక్ట్‌ను ఈజీగా క్యారీ చేసే విధంగా రూపొందించారు. మూలల్లో ఉన్న దుమ్మును కూడా చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.

EVETIS: కార్లలో పేరుకు పోయే దుమ్మును తొలగించేందుకు ఈ వాక్యూమ్ క్లీనర్ బెస్ట్. EVETIS Portable Wireless Car & Home Cleaning Vacuum DC 120W పేరుతో ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉందీ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అసలు ధర రూ. 5000 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1124కే లభిస్తోంది. పలు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇది వైర్‌లెస్ వాక్యూమ్ క్లీనర్. ఛార్జింగ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రొడక్ట్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు

Inalsa Homeasy: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ వాక్యూమ్ క్లీనర్.. Inalsa Homeasy WD10 Wet & Dry Vacuum Cleaner. యాంటీ బ్యాక్టీరియల్ అనే అధునాతన ఫీచర్ దీని సొంతం. ఈ వాక్యూమ్ క్లీనర్ అసలు ధర రూ. 11,895కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3219కే సొంతం చేసుకోవచ్చు. 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక ఇందులో 1200 వాట్స్‌తో పనిచేసే పవర్ ఫుల్ మోటర్‌ను అందించారు. 10 లీటర్ల ట్యాంక్ బాడీని అందించారు.

Inalsa QuickVac: ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ వాక్యూమ్ క్లీనర్.. Inalsa QuickVac Dry Vacuum Cleaner with Reusable Dust Bag . దీని అసలు ధర రూ. 4,195కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2,642కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. 7రోజుల రీప్లెస్మెంట్‌ను సైతం ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. కేవలం 1.9 కిలో బరువున్న ఈ క్లీనర్‌ను హ్యాండిల్ చేయడం చాలా సులభం.





























