- Telugu News Photo Gallery Technology photos Amazon Alexa planning to introduce project Banyan AI service in Alexa
Alexa: కొత్త రూపు సంతరించుకోనున్న అలెక్సా.. అయితే ఓ కండిషన్
ప్రస్తుతం మార్కెట్లో వాయిస్ అసిస్టెంట్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. యాపిల్ మొదలు, గూగుల్, అమెజాన్ వరకు వాయిస్ అసిస్టెంట్ సేవలను అందిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అందిస్తున్న అలెక్సా సేవల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అయితే తాజాగా అలెక్సాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు..
Updated on: Jun 23, 2024 | 10:57 AM

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. వాయిస్ అసిస్టెంట్ సేవలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెజాన్ సైతం అలెక్సా ఏఐని ఉపయోగించనున్నారు.

అలెక్సాలో జనరేటివ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అయితే ఈ సేవలు ఉచితంగా లభించవు. యూజర్లు ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏఐ సేవలను ఉపయోగించుకోవడానికి సుమారు రూ. 400 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్ 2014లో తీసుకొచ్చిన నాటి నుంచి అలెక్సాలో తీసుకొచ్చిన పెద్ద మార్పు ఇదేనని చెప్పాలి. అలెక్సాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది యూజర్లకు మరింత కచ్చితమైన సమాధానాలు ఇవ్వనుంది.

ఇప్పటి వరకు అలెక్సా అందించిన సేవలతో పోల్చితే ఈ ఏఐ సేవలు మరింత అధునాతన ఫీచర్లను అందించనున్నారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు అమెజాన్ సన్నాహాలు చేస్తోంది.

గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో అమెజాన్ ప్రాజెక్ట్ బన్యాన్ పేరుతో అలెక్సాలో మార్పులు తీసుకొస్తోంది. ఇక కొత్త వెర్షన్‌తో యూజర్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు, ఆదాయం సమకూర్చే ఆలోచనలో కంపెనీ ఉంది.




