- Telugu News Photo Gallery Take oath in court know how witness take oath in court room know is geeta used in court for oath check all details au52
Take Oath in Court: ‘భగవద్గీతపై ప్రమాణం చేసి నిజమే చెబుతాను’.. కోర్టులో సాక్షులు నిజంగానే ఇలా ప్రమాణం చేస్తారా?
Take Oath in Court: ‘భగవద్గీతపై ప్రమాణం చేసి నిజమే చెబుతాను’.. కోర్టులో సాక్షులు నిజంగానే ఇలా ప్రమాణం చేస్తారా?
Updated on: May 17, 2022 | 1:59 PM

Take Oath in Court: మనం చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కోర్టు సన్నివేశం వచ్చినప్పుడల్లా ఎవరైనా సాక్షి, సాక్ష్యం చెప్పినప్పుడు మతగ్రంధమైన భగవద్గీతపై ప్రమాదణం చేయడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ‘‘నేను ఏది చెప్పినా నిజమే చెబుతాను, నిజం తప్ప మరేమీ చెప్పను’ అని గీతపై చేయి వేసి ప్రమాణం చేస్తున్నాను.’’ అని సాక్షి చెప్పడం చూస్తూనే ఉంటాం. అయితే, వాస్తవానికి అలాంటి ప్రమాణ కోర్టులో చేస్తారా? దీనిని సినిమాల్లో చూపించడానికి అసలు కారణం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి సన్నివేశాలు, సందర్భాలు కోర్టులో జరుగుతాయా? లేదా అనే అంశంపై న్యాయవాదులు క్లారిటీ ఇస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు ఉంటాయన్న దానిని వారు నిరాకరించారు. ప్రస్తుత కాలంలో అలాంటిదేమీ జరుగదని న్యాయవాదులు చెబుతున్నారు. ఒక కేసులో సాక్ష్యం చెప్పేవారు మపరమైన గ్రంధంపై చేయి వేసి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని, ఇది సినిమాల్లోనే జరుగుతుందని న్యాయవాదులు చెప్పారు.

అలాంటప్పుడు వాంగ్మూలం ఎలా జరుగుతుంది? న్యాయవాది చేతన్ పరీక్ వివరిస్తూ.. ఎవరైనా కోర్టులో అఫిడవిట్‌తో కోర్టు హాలులో వాంగ్మూలం ఇవ్వవలసి ఉంటుంది. అలాంటిప్పుడు సాక్షులు మాత్రమే దేవునిపై ప్రమాణం చేస్తారని ఆయన చెప్పారు. కానీ, మతపరమైన పుస్తకంపై ప్రమాణం చేయాలనే ప్రత్యేక విధానం ఏదీ లేదని స్పష్టం చేశారు.

ఇదొక్కటే కాదు, కోర్టు గదిలోకి సడెన్ గా సాక్షి ప్రవేశించడం సినిమాల్లో చూస్తుంటాం. అయితే, ఇలాంటి సందర్భాలు కూడా ఉండవని న్యాయవాదులు చెబుతున్నారు. ఎవరైనా సాక్షిని కోర్టు ముందు హాజరుపరిచే ముందు.. కోర్టు, న్యాయమూర్తి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఒక్కో పద్ధతిలో ఉంటుందని పేర్కొన్నారు.

గీత పై ప్రమాణం ఎక్కడ నుండి వచ్చింది?- మొఘలుల కాలంలో మతపరమైన పుస్తకాన్ని వినియోగించారని తెలుస్తోంది. పవిత్రమైన మత గ్రంధంపై ప్రమాణం చేయడం ద్వారా సాక్షి అబద్ధం చెప్పరని నాటి విశ్వాసం. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా దీనిని కొనసాగించాయి. 1950 వరకు ఈ విధానాన్ని అనుసరించడం జరిగింది. అయితే, 1969లో 28వ లా కమిషన్ నివేదికలో సిఫారసు మేరకు కొత్త ప్రమాణ స్వీకరా చట్టం వచ్చింది. అప్పటి నుంచి నేను దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను అని మాత్రమే చెప్పడం జరుగుతుందని న్యాయవాదులు చెప్పారు.




