ICC Rankings: మరోసారి దుమ్ములేపిన రిషభ్ పంత్.. మొన్నటి కంటే మరింత మెరుగ్గా..!
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసి, ఐసిసి ర్యాంకింగ్స్‌లో 7వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Pant 5
- ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్లు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడుతున్నాయి. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున ఐదు సెంచరీలు నమోదు అయినప్పటికీ గెలవలేకపోయింది. అయితే, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
- లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తరపున రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన రిషబ్ పంత్, టీమ్‌కు మంచి స్కోర్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
- పంత్ చేసిన రెండు సెంచరీలు అతన్ని ఐసిసి ర్యాంకింగ్స్‌లో మెరుగుపడేలా చేశాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉన్న పంత్, ఈ వారం ఒక స్థానం మెరుగుపడి 6వ స్థానాన్ని ఆక్రమించాడు.
- పంత్ ప్రస్తుతం 801 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు, ఇది అతని కెరీర్లో అత్యుత్తమ రేటింగ్. రిషబ్ పంత్ ఆరో స్థానానికి ఎదగడానికి మరో కారణం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండటం. బావుమా ర్యాంకింగ్స్‌లో పడిపోయి, పంత్ 7వ స్థానం నుండి 6వ స్థానానికి ఎగబాకాడు.
- ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. హెడింగ్లీ టెస్ట్‌లో వరుసగా 28, 53(నాటౌట్) పరుగులు చేసిన రూట్ 889 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.