- Telugu News Photo Gallery Sports photos Pollard's Record: 700 T20 Matches! Mumbai Indians Mentor Makes History
టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై ఇండియన్స్ మెంటర్! దరిదాపుల్లో ఇంకొకడు లేడు..
ముంబై ఇండియన్స్ మెంటర్ కీరన్ పోలార్డ్ 700 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. MLC 2025 టోర్నమెంట్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. అతని 13668 పరుగులు T20 చరిత్రలో మూడో అత్యధికం. పోలార్డ్‌కు దగ్గరగా ఉన్న ఆటగాళ్ళు కూడా 600 మ్యాచ్‌లు ఆడలేదు.
Updated on: Jun 25, 2025 | 2:16 PM

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ మెంటర్ కీరన్ పొలార్డ్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. డల్లాస్‌లో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2025) టోర్నమెంట్‌లోని 14వ మ్యాచ్‌లో ఆడటం ద్వారా పొలార్డ్ ప్రత్యేక ఘనత సాధించాడు.

శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆడటం ద్వారా కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 700 మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రత్యేకత ఏమిటంటే పొలార్డ్ తప్ప, ఏ ఆటగాడు టీ0 క్రికెట్‌లో 600 మ్యాచ్‌లు కూడా ఆడలేదు.

ఇదిలా ఉండగా వెస్టిండీస్, ముంబై ఇండియన్స్, ఎంఐ న్యూయార్క్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ సహా అనేక జట్లకు ఆడిన పొలార్డ్ ఇప్పుడు 700 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడు వందల మ్యాచ్‌లలో విండీస్ బ్యాట్స్‌మన్ 622 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు.

కీరన్ పొలార్డ్ 622 ఇన్నింగ్స్‌లలో 13668 పరుగులు చేశాడు, మొత్తం 9080 బంతులను ఎదుర్కొన్నాడు. దీంతో అతను T20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో మూడవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. క్రిస్ గేల్ (14562) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, అలెక్స్ హేల్స్ (13730) రెండవ స్థానంలో ఉన్నాడు.

కీరన్ పొలార్డ్ తర్వాత, T20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు డ్వేన్ బ్రావో (582), షోయబ్ (557), ఆండ్రీ రస్సెల్ (556), సునీల్ నరైన్ (551), డేవిడ్ మిల్లర్ (530), అలెక్స్ హేల్స్ (500). T20 క్రికెట్‌లో 500 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న ఏడుగురు ఆటగాళ్లు వీరే.




