- Telugu News Photo Gallery Sports photos Krishna prasad garaga and vishnu vardhan mens doubles final of the orleans masters and srikrishna priya into polish open
Hyderabad Stars: విశ్వ విపణిలో హైదరాబాదీల జోరు.. టైటిల్ పోరుకు విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ జంట
Orleans Masters: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాదీలో దూసుకుపోతున్నారు. మరో వైపు తెలుగు యువ తేజం శ్రీకృష్ణ ప్రియ.. పొలీష్ ఓపెన్ టోర్నీలో మంచి ఆటతీరుతో కట్టిపడేస్తోంది.
Updated on: Mar 29, 2021 | 6:47 AM

ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది.

సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ ద్వయం 21–17, 21–17తో కాలమ్ హెమ్మింగ్–స్టీవెన్ స్టాల్‌వుడ్ జోడీపై గెలిచింది.

సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ ద్వయం 21–17, 21–17తో కాలమ్ హెమ్మింగ్–స్టీవెన్ స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది.

తెలుగు యువ క్రీడా తేజం శ్రీకృష్ణ ప్రియ.. పొలీష్ ఓపెన్ టోర్నీలో ఆకట్టుకుంటోంది. పోలాండ్‌లో జరుగుతున్న పొలీష్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీలో శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి సెమీఫైనల్‌కు చేరుకుంది.

కొవిడ్ మహమ్మారి, లాక్డౌన్ తర్వాత తన బలాలు, బలహీనతలు అంచనా వేయడానికి తనకు అవకాశం వచ్చిందని శ్రీకృష్ణ ప్రియ చెప్పింది. కరోనా ప్రభావం తర్వాత తాను ఆడిన మొదటి టోర్నీ ఇదేనని తెలిపింది.




