- Telugu News Photo Gallery Spiritual photos Vyaya Yoga 2025: How 6 Zodiac Signs Spend and Grow Wealth by December
Vyaya Yoga 2025: ఈ రాశుల వారికి అరుదైన వ్యయ యోగం! సంపదకు లోటుండదు..
జ్యోతిష శాస్త్రంలో వ్యయ యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. సంపద తరగకుండా, అప్పులు చేయకుండా ఖర్చు పెట్టడం ఈ యోగ విశిష్టత. ఇష్టమైన లేదా కావలసిన వస్తువులు కొనుక్కో వడం, వస్త్రాభరణాల మీద పెట్టుబడులు పెట్టడం, ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడం వంటివి ఈ వ్యయ యోగ లక్షణాలు. ప్రస్తుతం డిసెంబర్ రెండవ వారం వరకు మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ యోగం పట్టింది. ఈ రాశులవారు భారీగా ఖర్చు పెట్టినా, వీరి కుటుంబంలో ఖర్చులు పెరిగినా పెద్దగా నష్టం ఉండదు.
Updated on: Oct 09, 2025 | 8:08 PM

మేషం: ఈ రాశికి ఆదాయం బాగా పెరగడంతో పాటు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. విలాసాలు, విదేశీ పర్యటనలు, విహార యాత్రల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. పెళ్లి, సొంత ఇల్లు, సొంత వాహనం వంటి వాటి మీద భారీగా ఖర్చు పెట్టి సుఖపడడం జరుగుతుంది. ఆస్తి లాభం, ఆరోగ్య భాగ్యం కలగడం వల్ల వీరి సంపద తరిగే అవకాశం లేకపోవచ్చు.

కర్కాటకం: ఈ రాశివారికి ఈ ఏడాదంతా ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యంగా అక్టోబర్ 19 తర్వాత నుంచి డిసెంబర్ 5 వరకు వీరి ఆదాయం అపారంగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఫలితంగా వీరి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. వీరు వస్తు వాహనాల మీద విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు, తీర్థ యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. శుభ కార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది.

కన్య: ఈ రాశివారు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా నష్టమేమీ ఉండదు. జీవితాన్ని గరిష్ఠ స్థాయిలో సుఖ సంతోషాలతో అనుభవించడం జరుగుతుంది. విలాస జీవితం మీదా, విలాస వస్తువుల మీదా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. వస్తు వాహనాలకు సంబంధించి వీరి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. సకల సౌకర్యాలు కలిగిన ఇల్లు అమరే అవకాశం ఉంది. స్థలాల కొను గోలు మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది.

తుల: ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో జీవనశైలి పూర్తిగా మారి పోయే అవకాశం ఉంది. విలాసాలతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద కూడా ఈ రాశివారు బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యానే కాకుండా పర్యాటక పరంగా కూడా వీరు విదేశీ పర్యటనలు చేయడం జరుగుతుంది. సుఖ సంతోషాల మీద ఎంత ఖర్చుకైనా వీరు వెనుకాడరు. మనసులోని కోరికలు, ఆకాంక్షలన్నీ దాదాపు పూర్తిగా నెరవేరే అవకాశం ఉంది.

ధనుస్సు: ఖర్చు విషయంలో ఈ రాశివారు ఇతర రాశుల కంటే బాగా ముందుంటారు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం, పట్టిందల్లా బంగారం అవుతుండడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడికి లోటు లేకపోవడం వల్ల వీరు ఖర్చుకు వెనుకాడే అవకాశం లేదు. విదేశీ పర్యటనలు, విహార యాత్రలు, విలాసవంతమైన జీవితం, సొంత ఇల్లు, వాహనం వంటి వాటి మీద వీరు బాగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

మకరం: అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం, వారసత్వ సంపద కలిసి రావడం, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలగడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి ఈ ఏడాదంతా సంపదకు లోటుండదు. వీరు జీవిత భద్రత కోసం, ఇష్టమైన ప్రాంతాలను, ఆలయాలను సందర్శించడం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మదుపులు, పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. తీర్థ యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ప్రేమించినవారి మీద ఖర్చు బాగా పెరుగుతుంది.



