AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025 Horoscope: కీలక గ్రహాల అనుకూలత.. దీపావళితో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..!

Diwali 2025 Astrology: దీపావళితో నాలుగు గ్రహాల అనుకూలత కలుగుతున్న కారణంగా కొన్ని రాశుల వారికి అక్టోబర్ 20 తర్వాత నుంచి దశ తిరగబోతోంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు అనుకూలంగా మారుతుండడం వీరికి తప్పకుండా వరప్రసాదం కాబోతోంది. దీపావళి తర్వాత నుంచి ఏడాది చివరి వరకూ వీరు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం కాబోతోంది. ఈ మూడు నెలల సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2025 | 7:39 PM

Share
మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు అనేక విధాలుగా అదృష్టాన్ని కలిగించ బోతున్నాయి. చంద్రుడి సహకారం కూడా తోడవుతున్నందువల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందడం, పురోగతిలో ఆటంకాలు తొలగిపోవడం, కలలు సాకారం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.

1 / 6
వృషభం: ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకూ అన్ని రాశుల కంటే అదృష్టవంతమైన రాశి ఇదే. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడితో సహా అయిదు గ్రహాలు ఈ ఏడాది చివరి వరకూ అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన యోగం కలిగే సూచనలున్నాయి. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి.

3 / 6
కన్య: రాశ్యధిపతి బుధుడితో సహా నాలుగు గ్రహాల అనుకూల సంచారం వల్ల వచ్చే మూడు నెలల కాలంలో ఈ రాశివారి జీవితం అనేక విధాలుగా సానుకూల మలుపులు తిరగబోతోంది. ఈ రాశి వారికి ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. మనసులోని కోరికలు, ఆశలు, కలలు చాలా వరకు నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.

4 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధ, రవి, కుజులు కూడా దీపావళి తర్వాత నుంచి బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపా రంగా లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు.

5 / 6
మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనితో సహా ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల అనేక విధాలుగా పురోగతి చెందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం చేపట్టినా ఘన విజయాలు సిద్ధిస్తాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు దశ తిరుగుతుంది.

6 / 6