AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: భార్యాభర్తల మధ్య మనస్పర్థలా.. ఇంట్లో ఈ పువ్వుల మొక్కలు పెంచితే బాంధవ్యంలో మాధుర్యం మీ సొంతం..

Vastu Tips: జీవితాంతం కలిసి ఉండే బంధం భార్యాభర్తల బాంధవ్యం.. అయితే దంపతుల మధ్య ఏ చిన్న అనుమానం, వివాదాలు ఏర్పడినా ఆ బంధం మధ్య బీటలు ఏర్పడతాయి. అయితే భార్యాభర్తలు పరస్పర అవగాహనతో తగాదాలను ముగించవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా దంపతుల మధ్య అనురాగానికి.. బంధానికి వాస్తు చిట్కాలు సహాయపడతాయి. పెంచుకోండి.

Surya Kala
|

Updated on: Jun 20, 2022 | 6:13 PM

Share
 వాస్తు శాస్త్రంలో ఇంటిని నిర్వహించడానికి మాత్రమే కాకుండా, సంబంధాలను మెరుగుపరచడానికి కూడా కొన్ని చర్యలు ఇవ్వబడ్డాయి. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదాలు ఇంట్లో కొన్నిరకాల పువ్వుల మొక్కలు పెంచుకోవడం.. చక్కని పరిష్కరామని పేర్కొన్నాయి.

1 / 5
 బిళ్ళగన్నేరు పువ్వులు: పింక్, తెలుపు రంగుల్లో ఉండే బిళ్ళగన్నేరు పువ్వులు ప్రేమను పెంచుతాయని నమ్మకం. ఈ మొక్కలను ఇంటి బయట ఆవరణలో పెంచుకోవడం వలన..నెగటివ్ ఎనర్జీ మీకు, మీ కుటుంబానికి దూరంగా ఉంటుంది. సానుకూలత ఏర్పడి. భార్య భర్తల మధ్య గొడవలు దరిచేరవని నమ్మకం.

2 / 5
 ఎర్ర గులాబీ: ప్రేమకు చిహ్నం ఎర్రగులాబీ. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోవాలంటే వాస్తు ప్రకారం గులాబీ పువ్వు మొక్కలను  ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే బెడ్‌రూమ్‌లో  ఎర్రగులాబీలను ఉంచడం వలన దంపతుల మధ్య మరింత ప్రేమ, నమ్మకం పెరుగుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.

3 / 5
 
తామర పువ్వు: ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన తామర పువ్వు, లక్ష్మీదేవికి సంబంధించినదని నమ్ముతారు. మీరు వాస్తు ప్రకారం ఈ పువ్వును ఇంట్లో పెంచుకోవచ్చు. ఇంటికి తూర్పు దిక్కున తామర మొక్కను పెంచుకోవడం ఉత్తమం.

4 / 5
 మల్లె పువ్వు: వాస్తు ప్రకారం..  ఈ పువ్వు సువాసన, ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించడమే కాకుండా.. భార్యాభర్తల మధ్య  సంబంధాలలో కూడా మాధుర్యాన్ని తెస్తుంది. మల్లెపువ్వు సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది.ఈ మొక్కను ఇంట్లో ఏ మూలలోనైనా ఉంచవచ్చు.

5 / 5